Saturday, April 28, 2012

కృష్ణవంశీ 'పైసా' ఎలా వుంటుంది?

ఆమధ్య 'మిరపకాయ్' చిత్రాన్ని నిర్మించిన ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల, ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి బాలకృష్ణ హీరోగా రవికుమార్ చావలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రం కాగా; నాని కథానాయకుడుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మరొకటి. రెండు చిత్రాల షూటింగులు ప్రస్తుతం హైదరాబాదులోనే జరుగుతున్నాయి. కృష్ణవంశీ రూపొందిస్తున్న చిత్రంలో నాని పక్కన కథానాయికగా మలయాళ భామ కేథరిన్ థెరీసా నటిస్తోంది. ఈ చిత్రానికి 'పైసా' అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుత వ్యవస్థపై రూపొందించిన వ్యంగ్య కథతో కృష్ణవంశీ దీనిని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

1 comment:

  1. Good website like https://www.wisdommaterials.com/index.html

    ReplyDelete