![]() | ||
ముంబై భామలకి ముందుగా అవకాశాలు, నాలుగు డబ్బులు తెచ్చిపెట్టేది టాలీవుడ్డు, కాకపొతే కోలీవుడ్డు. ఇక్కడ ఛాన్సులు లేకపోతే అక్కడికీ, అక్కడ లేకపోతే ఇక్కడికీ షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉంటూ వుంటారు. ఇప్పుడు తమన్నా కూడా అదే పనిలో వుంది. ముందు టాలీవుడ్ లో ట్రై చేసింది. అయితే ఇక్కడ సినిమాలు లేకపోవడంతో కోలీవుడ్ వెళ్లిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన 'కొంచం ఇష్టం-కొంచం కష్టం' సినిమా తన జాతకాన్ని మార్చేస్తుందని ఎంతగానో ఆశించింది. కానీ, అది ఢమాల్ మనడంతో తనకి తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే ఇలా అంటే, తమన్నా ఒప్పుకోదు. "ఆ సినిమా తర్వాత తెలుగులో చాలా కధలు విన్నాను. కానీ నాకు నచ్చలేదు. అందుకే ఏవీ కమిట్ కాలేదు. తమిళ్ లో మంచి ఆఫర్లు వచ్చాయి. ఏ సినిమా అయినా ఒప్పుకునే ముందు కధ, నా క్యారక్టర్, హీరో... ఈ మూడూ నాకు నచ్చాలి. అప్పుడే ఓకే చెబుతాను" అంటూ మనకి 'కధ'లు చెబుతోంది. అయినా తమన్నాకి ఇంత సీనుందా ఇక్కడ? |
No comments:
Post a Comment