![]() | ||
జీవితంలో పెద్ద స్థాయికి చేరుకున్న వాళ్లకి అన్ని రకాలుగానూ డబ్బులే. అందులోనూ సినీతారలకైతే చెప్పేక్కర్లేదు. అటు సినిమాలు, ఇటు వాణిజ్య ప్రకటనలు... స్టేజ్ షోలు... రకరకాల ఇన్ కమ్. ఇప్పుడు అందాల తార ఐశ్వర్యారాయ్ పనీ అలాగే వుంది. ఎడాపెడా ఆదాయమే. తాజాగా మరో కొత్త ఆఫర్ వచ్చింది. ఆమె జీవిత చరిత్రను పుస్తక రూపంలో ప్రచురించడానికి ఓ విదేశీ ముద్రణా సంస్థ ముందుకొచ్చింది. ఇటీవల ఐష్ ని కలిసి తమ ఆఫర్ ని ఆమె ముందుంచి, పారితోషికంగా ఓ బ్లేంక్ చెక్ ఆఫర్ చేసారట. ఐష్ ఆ ఆఫర్ కి టెంప్ట్ అయిందట. అయితే, ఆ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాస్పద విషయాలను టచ్ చేయకూడదని కండిషన్ పెడుతోందట. దాంతో సదరు ప్రచురణ కర్తలు ఆలోచనలో పాడ్డారు. ఎందుకంటే, సల్మాన్, వివేక్ ఒబెరాయ్ లతో ఆమె సన్నిహిత్వానికి చెందిన వివాదాస్పద అంశాలను పక్కన పెడితే ఇక ఆ పుస్తకానికి విలువేముంటుంది? దానిని ఎవరు కొంటారు? |
No comments:
Post a Comment