![]() | ||
రాంగోపాల్ వర్మ పట్టువదలని విక్రమార్కుడిగా చిరంజీవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తనతో చిరంజీవి ఇక సినిమా చేయడని తెలిసి కూడా రకరకాల పద్ధతుల్లో తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ట్విట్టెర్ ని కూడా ఉపయోగించుకుంటున్నాడు. అస్తమానూ చిరంజీవి ప్రస్తావన ఏదో ఒక రూపంలో తెస్తున్నాడు. తాజాగా కూడా తెచ్చాడు. "చిరంజీవి గారి 150 వ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇది ఇంకా ఎందుకు స్టార్ట్ అవలేదో ఎవరైనా చెప్పగలరా?" అంటూ అడుగుతున్నాడు. "చిరంజీవి గారు నాతో చేయరని తెలుసు. దానికి మా ఇద్దరి మధ్య చాలా కారణాలున్నాయి. అయితే, నేను చేయాలనుకుంటున్న 'దొర' ద లార్డ్ సినిమాని ఆయనతోనే చేయాలని మాత్రం కోరుకుంటున్నాను" అంటూ సోప్ వేస్తున్నాడు. మరి, చిరంజీవి పొరబాటున వర్మ బుట్టలో పడతాడేమో చూడాలి! |
No comments:
Post a Comment