Sunday, January 29, 2012

బాబాసైగల్ తో 'శృతి' కలిసింది!

 
 
        తన సినిమాలు హిట్టవకపోయినా, తను సింగర్ గా హిట్టవుతున్నందుకు మాత్రం శృతి హాసన్ ఇప్పుడు చాలా హ్యాపీగా వుంది. అటు ఆర్టిస్టుగా పలు చిత్రాలలో నటిస్తూనే, గాయనిగా కూడా తన ఆసక్తిని శృతి ప్రదర్శిస్తూనే వుంది. తను నటించే సినిమాలలోనే కాకుండా ఇతరుల చిత్రాలలో కూడా పాటలు పాడుతోంది. ఆ క్రమంలో తాజాగా బాబా సైగల్ తో కూడా కలిసి ఓ పాట పాడింది. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చిన 'ముప్పోజుతుం ఉన్ కర్పనైగళ్' అనే చిత్రంలో బాబాతో కలిసి తన గళం కలిపింది. ఇదొక ఫోక్ సాంగ్ అనీ, బాబాతో కలిసి పాడడం ఎంతో హ్యాపీగా ఉందనీ శృతి అంటోంది. చిన్నప్పటి నుంచీ తను బాబా సైగల్ కి ఫ్యాన్ నని చెబుతోంది.
 

No comments:

Post a Comment