Wednesday, February 8, 2012

చిన్న సినిమా తీస్తున్న పెద్ద దర్శకుడు!


తమ వేతనాలు పెంచాలంటూ తమిళ చిత్ర పరిశ్రమలోని కార్మికులు గత పది రోజుల నుంచీ సమ్మె చేస్తుండడంతో తమిళ సినిమాల షూటింగులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇలా నిలిచిపోయిన చిత్రాలలో విజయ్, కాజల్ జంటగా మురుగదాస్ రూపొందిస్తున్న 'తుపాకి' సినిమా షూటింగు కూడా ఉంది. దాంతో ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో తెలియక తారలు, దర్శకులు సతమతమవుతున్నారట.
     ఈ నేపథ్యంలో ఈ సమయాన్ని మరో కార్యక్రమానికి వినియోగించుకోవాలని దర్శకుడు మురుగదాస్ నిర్ణయించుకున్నాడు. పది నిమిషాల పాటు సాగే ఓ షార్ట్ ఫిలిం రూపొందించే ప్లాన్ చేస్తున్నాడు. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథగా దీనిని తెరకెక్కిస్తాడట. ప్రస్తుతం కొత్త హీరో హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఇటీవల తన ఇంటి సమీపంలో కొంతమంది టీనేజర్లు కలిసి మాట్లాడుకోవడం మురుగదాస్ చెవిన పడిందట. వారి సంభాషణ నుంచే ఈ కథకు ఐడియా తట్టిందట!   
 

No comments:

Post a Comment