
ఇక ఆ సినిమా కథేమిటి ...? అది రాజకీయ నేపథ్యానికి సంబంధించిన సందేశాత్మక చిత్రమా ...? అందులో అలరించే అందాల హీరోయిన్ ఎవరు ... ? అపారమైన అంచనాలతో ఉన్న ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకుడిగా వ్యవహరించనుండటం నిజమేనా ? ఇలా ఈ సినిమాకి సంబంధించిన అన్ని అంశాల గురించి అభిమానులు అదేపనిగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ గాసిప్ త్వరలో నిజం కాబోతోందనే వార్తలు ఇప్పుడు మరింత వేగాన్ని పుంజుకున్నాయి.
మెగాస్టార్ నటించనున్న సందేశాత్మక చిత్రానికి వినాయక్ దర్శకుడిగా ఖరారు అయినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చల్లో తాజాగా వీరిద్దరూ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా చేస్తోన్న వినాయక్, ఆ సినిమా పూర్తి కాగానే చిరంజీవి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు చెబుతున్నారు. మరి ఈ సారైనా ఈ వార్త నిజమౌతుందో ... లేదంటే గాసిప్ గేలరీ లోనే ఉండిపోతుందో ... !
No comments:
Post a Comment