
GOSSIPS
Saturday, April 28, 2012
కృష్ణవంశీ 'పైసా' ఎలా వుంటుంది?

'మెగా'మూవీకి వినాయక్ దర్శకుడట !

ఇక ఆ సినిమా కథేమిటి ...? అది రాజకీయ నేపథ్యానికి సంబంధించిన సందేశాత్మక చిత్రమా ...? అందులో అలరించే అందాల హీరోయిన్ ఎవరు ... ? అపారమైన అంచనాలతో ఉన్న ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకుడిగా వ్యవహరించనుండటం నిజమేనా ? ఇలా ఈ సినిమాకి సంబంధించిన అన్ని అంశాల గురించి అభిమానులు అదేపనిగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ గాసిప్ త్వరలో నిజం కాబోతోందనే వార్తలు ఇప్పుడు మరింత వేగాన్ని పుంజుకున్నాయి.
మెగాస్టార్ నటించనున్న సందేశాత్మక చిత్రానికి వినాయక్ దర్శకుడిగా ఖరారు అయినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చల్లో తాజాగా వీరిద్దరూ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా చేస్తోన్న వినాయక్, ఆ సినిమా పూర్తి కాగానే చిరంజీవి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు చెబుతున్నారు. మరి ఈ సారైనా ఈ వార్త నిజమౌతుందో ... లేదంటే గాసిప్ గేలరీ లోనే ఉండిపోతుందో ... !
ఐశ్వర్యకు పాపే ప్రపంచం!

ఒక విధంగా చెప్పాలంటే, పిల్ల నిద్రపోయే సమయాన్ని బట్టి తన పనులు చేసుకుంటోంది. ఇటీవల తమ మేరేజ్ డేకి స్నేహితులతో కలిసి అభిషేక్, ఐశ్వర్య ఓ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్లడం జరిగింది. అయితే, అక్కడ వారు ఎక్కువ సేపు గడపలేకపోయారట. కారణం... 'బేటీ బి' కి పాలు పట్టాల్సిన సమయం వచ్చేసిందట. ఆ కూర్చున్న కాసేపూ కూడా ఇష్ ముళ్ల మీద కూర్చున్నట్టే కూర్చుందట. అక్కడికీ, తమ ఇంటికి అతి సమీపంలోని రెస్టారెంట్ నే ఎంచుకున్నారట కూడా!
ఇక గత నెలలో ఒక ఎండార్స్ మెంట్ షూటింగ్ నిమిత్తం ఐష్ దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కూడా తన ముద్దుల చిన్నారిని తన వెంట తీసుకువెళ్ళిందట. పైగా, షూటింగు కూడా తను వున్నా హోటల్ కి దగ్గరలోనే పెట్టుకోమని చెప్పిందట. షూటింగు మధ్యలో లేచి వెళ్లి, పిల్లను చూసుకుని రావడం చేసేదట. ఇలా ఇప్పుడు ఐశ్వర్య జీవితం పిల్ల చుట్టూ తిరుగుతోంది. పిల్లే ఆమెకు ప్రపంచంలా కనిపిస్తోంది. ఆ చిన్నారి తర్వాతే ఆమెకు ఇప్పుడు ఏదైనా... అభిషేక్ అయినా సరే!
తమన్నతో కలిసి బీదర్ వెళ్లిన రామ్ ! Sat, Apr 28, 2012

'రూలర్'గా 'షేక్' చేయించనున్న బోయపాటి !

Wednesday, March 14, 2012
బాలీవుడ్ కి వెళ్తోన్న 'బిజినెస్ మేన్'

అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఇందుకు పూరీ జగన్నాథ్ కూడా సిద్ధంగా ఉన్నాడనీ ... అభిషేక్ బచ్చన్ ని హీరోగా ఎంచుకున్నామని అన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఈ రోజు ఉదయం ఆయన ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు. దాంతో మళ్లీ ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయిందని తెలుస్తోంది.
గోపీచంద్ కి సాయం చేయబోతోన్నతాప్సీ

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై రూపొందుతోన్న చిత్రంలో గోపీచంద్ నటిస్తోన్న సంగతి ప్రేక్షకులకి తెలుసు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెర కెక్కుతోన్న ఈ సినిమాకి కొంత మంది కథానాయికలను పరిశీలించి చివరికి తాప్సీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి కోసం అన్వేషిస్తోన్న గోపీచంద్ కి కథానాయికగా తాప్సీ సాయం చేస్తూవుంటుంది. ఇక గతంలో గోపీచంద్ నటించిన 'ఒక్కడున్నాడు' చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా వ్యవహరించారు. దాదాపు అయిదేళ్ల గ్యాప్ తరువాత వస్తోన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోననే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి.
Subscribe to:
Posts (Atom)