e-cigarette review Ping Yahoo GOSSIPS: NITYA MEENAN
Showing posts with label NITYA MEENAN. Show all posts
Showing posts with label NITYA MEENAN. Show all posts

Monday, January 23, 2012

నిత్యా మీనన్ కు '50% లక్'

అలా మొదలైంది సినిమా హిట్టయినా కూడా కథానాయిక నిత్యా మీనన్ కి తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. ఏవో ఒకటీ అరా వచ్చినా, అవి చిన్నా చితకా సినిమాలే! నితిన్ తో ఆమె నటించిన 'ఇష్క్' సినిమా షూటింగు పూర్తి చేసుకోగా, ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 'ఒక్కడినే' సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగు ఇటీవలే ప్రారంభమైంది. ఇదిలా ఉంచితే, నిత్యా కథానాయికగా త్వరలో మరో సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి '50% లక్' అనే టైటిల్ నిర్ణయించారట. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి. ఏమైనా, ఈ '50% లక్' అనే టైటిల్ మాత్రం ఆమె సినిమాకే కాకుండా, కెరీర్ కి కూడా సరిగ్గా సరిపోతుందని టాలీవుడ్ లో జోక్ చేస్తున్నారు.
Related Posts Plugin for WordPress, Blogger...