e-cigarette review Ping Yahoo GOSSIPS: Pony Varma
Showing posts with label Pony Varma. Show all posts
Showing posts with label Pony Varma. Show all posts

Wednesday, February 8, 2012

భర్త అడుగుజాడల్లో కొరియోగ్రాఫర్

డ్యాన్స్ మాస్టర్లంతా ఒక్కొక్కరే దర్శకులుగా మారిపోతున్నారు. ఈ కోవలోకి తాజాగా పోనీ వర్మ కూడా చేరిపోతోంది. బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన పోనీ వర్మ నటుడు ప్రకాష్ రాజ్ భార్య అన్న సంగతి మనకు తెలిసిందే. త్వరలో ఒక మాస్ ఎంటర్ టైనర్ ను రూపొందించాలనుకుంటున్నట్టు పోనీ వర్మ ప్రకటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని ఆమె తెలిపింది. దర్శకురాలిగా తన తొలి సినిమా బాలీవుడ్ హీరోతోనే ఉంటుందనీ, ఎవరితో అన్నది త్వరలో తెలియజేస్తాననీ ఆమె చెప్పింది. భర్త ప్రకాష్ రాజ్ తాజాగా డైరెక్ట్ చేసిన 'ధోనీ' సినిమా షూటింగు సమయంలో, అతని వెంటే వుండి దర్శకత్వంలో మెళకువలు తెలుసుకుందట. ఆ అనుభవంతో, దర్శకత్వంపై వున్న ఆసక్తితో ఆ శాఖలోకి ప్రవేశిస్తోంది.
Related Posts Plugin for WordPress, Blogger...