కధానాయిక త్రిష మొదటి నుంచీ ఏదో ఒక రూపంలో వార్తల్లోనే ఉంటోంది. కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆమె న్యూడ్ వీడియో అంటూ వచ్చిన ఫూటేజ్ ఓ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత త్రిష మందు, పబ్బులూ అంటూ తిరుగుతోందంటూ కొన్ని వార్తలు... మొన్నా మధ్య మాదకద్రవ్యాల కేసులో ఆమె పేరు రావడం.. ఏ హీరోయిన్ కీ రానంత నెగెటివ్ పబ్లిసిటీ త్రిషకు వచ్చింది. ఇప్పుడు ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 'మన్మధ బాణం' చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర నిర్మాత ఉదయనిధి స్టాలిన్ తో త్రిష ప్రేమాయణం మొదలైంది. ఉదయనిధి మరెవరో కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి మనవడు. ఇంకా చెప్పాలంటే, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ కి తనయుడు. ఇప్పుడు ఉదయ హీరోగా రూపొందనున్న సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ ప్రేమాయణం వార్త కాస్తా స్టాలిన్ దృష్టికి వెళ్లడంతో ఆమెకు గట్టి వార్నింగ్ వెళ్లినట్టు, దాంతో త్రిష తల్లిదండ్రులు కంగారుపడుతున్నట్టు తెలుస్తోంది. తమ కొడుకుని ఈ అమ్మడే ముగ్గులోకి దింపిందనీ, వదిలేస్తే అతని కెరీర్ పాడైపోతుందనీ స్టాలిన్ కోపంతో ఉన్నాడట. ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి! | ||
Thursday, January 6, 2011
త్రిషకు వార్నింగ్ వెళ్లిందట!
'ఎంతమంది వున్నా పర్వాలే'దంటోన్న దీక్షా సేథ్
ఇప్పుడు టాలీవుడ్ లో కుర్ర హీరోలనే కాకుండా, సీనియర్ హీరోలని కూడా ఆకట్టుకుంటున్న కధానాయిక గా దీక్షా సేథ్ ను చెప్పుకోవచ్చు. రవితేజ 'మిరపకాయ్' లోనూ, గోపీచంద్ 'వాంటెడ్' లోనూ దర్శకులు ఎలా చేయమంటే అలా తన అందాలను విశాలంగా ఆరబోసిందట. అందుకే, ఇప్పుడు చాలామంది తనే కావాలని 'దీక్ష' పడుతున్నారు. ఇదిలావుంచితే, ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల చిత్రాలలో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదంటోంది దీక్ష. 'అటువంటి సినిమాల్లో నటించడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. దానికి కారణం ఇన్ సెక్యురిటి. అయితే, నాకా బాధ లేదు. నేనెవరికీ కంగారుపడిపోను. ఎంతమంది వున్నా నాకేం పర్వాలేదు. వేదంలో చేసాను కదా? అయినా నాకు పేరొచ్చింది కదా?' అంటోంది. ప్రస్తుతం తను తెలుగు నేర్చుకుంటోంది. 'మరో ఏడు నెలలలో నా డబ్బింగ్ నేనే చెప్పేసుకుంటాను' అని కూడా చెబుతోంది. | ||
హృతిక్ ని కష్టపెడుతున్న దర్శకుడు
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు దుబాయ్ లో వున్నాడు. హాలిడే ని గడపడానికి ఫేమిలీతో వెళ్లాడు. అయితే, అక్కడికెళ్లి కూడా పొద్దున్నే లేచి జిమ్ కి వెళుతున్నాడు. రెండు గంటలపాటు కఠోర వ్యాయామం చేస్తున్నాడు. హాలిడే కెళ్లి ఇదేమిటి, అనుకుంటున్నారా? మరదే.... దర్శకుడు కరణ్ జొహార్ ఇచ్చిన ఆర్డర్ ని అమలు చేస్తున్నాడక్కడ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మరో నెల రోజుల్లో చేయబోయే సినిమా కోసం పెర్ఫెక్ట్ బాడీ కావాలని కరణ్ చెప్పడంతో, హృతిక్ కి ఈ పాట్లు తప్పడం లేదు. గతంలో అమితాబ్ నటించిన 'అగ్ని పథ్' చిత్రాన్ని హృతిక్ తో కరణ్ రీమేక్ చేస్తున్నాడు. ఆ చిత్రం కోసమే ఈ తతంగమంతా. ఈ సినిమాని చాలా ప్రెస్టేజియాస్ గా తీయాలని వీళ్లిద్దరూ భావిస్తున్నారట. | ||
రెహ్మాన్ తాజా మూజిక్ ఆల్బమ్
భారతీయ సినీ సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించి, దీనికి మహోన్నతమైన గౌరవాన్ని తీసుకు వచ్చిన ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహ్మాన్ తొలిసారిగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్ ను తీసుకువస్తున్నాడు. ప్రముఖ పాప స్టార్ డిడో తో కలిసి ఆయన దీనిని రూపొందించాడు. దీనికి సంబంధించిన కొన్ని క్లిప్స్ తో కూడిన వరల్డ్ ప్రీమియర్ ను రెహ్మాన్ తాజాగా తన వెబ్ సైట్ లో ఉంచాడు. డిడో తో కలిసి ఆయనీ ఆల్బమ్ లో పాటలు పాడాడు. ఇది త్వరలో మార్కెట్ లో రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంచితే, తన తాజా హాలీవుడ్ సినిమా '127 అవర్స్' నిన్ననే బ్రిటన్ లో విడుదలైంది. అన్నట్టు, ఈరోజు (జనవరి 6) రెహ్మాన్ తన 45 వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. | ||
వేలానికి 'బృందావనం' కిరీటం, ఫ్లూట్
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పేద కళాకారుల సహాయార్ధం కొన్ని సినిమాలలో ఆయా హీరోలు ఉపయోగించిన వస్తువుల్ని వేలానికి పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 'బృందావనం సినిమాలో యన్టీఆర్ వాడిన కిరీటాన్ని, ఫ్లూట్ ను ఆక్షన్ కు పెట్టారు. ఈ విషయాన్ని ఈరోజు (జనవరి 6 ) హైదరాబాదులో 'మా' కార్యాలయంలో 'మా' సభ్యులు తెలిపారు. 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ, "గతంలో 'అదుర్స్' సినిమాలోని కోటును, 'మగధీర' లోని కత్తిని, 'సింహా'లోని గొడ్డలిని ఆక్షన్ కి పెట్టాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అడగగానే దిల్ రాజు తమ 'బృందావనం' సినిమాలోని కిరీటం, ఫ్లూట్ ని ఇచ్చారు. వీటికి సంబంధించిన వివరాలు 'మా' వెబ్ సైట్ లో పెడుతున్నాం. అభిమానులు బాగా ఆదరించి దీనిని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆక్షన్ లో పాల్గొనడానికి చివరి తేదీ జనవరి 24 " అన్నారు. దిల్ రాజ్ చెబుతూ, "ఇక నుంచి నా ప్రతి సినిమాకు పేద కళాకారుల సహాయార్ధం లక్ష రూపాయలిస్తాను" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా శివకృష్ణ, హేమ, కాదంబరి కిరణ్, శేఖర్ కూడా పాల్గొన్నారు. సో... అభిమానులు ట్రై చేయచ్చు! | ||
'అలా మొదలైంది' ప్లాటినం డిస్క్ ఫంక్షన్
నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న 'అలా మొదలైంది' చిత్రం పాటల ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈరోజు (జనవరి 6 ) హైదరాబాదులోని మ్యూజిక్ వరల్డ్ లో జరిగింది. ఈ సందర్భంగా గెస్ట్ గా పాల్గొన్న దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ, "నందిని నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది. అప్పుడు ఏదైనా తనకు నచ్చక పొతే నిర్మొహమాటంగా చెప్పేది. ఇక ఈ సినిమా పోస్టర్ నాకు బాగా నచ్చింది. సినిమా ఎప్పుడు చూద్దామా అన్న క్యురియాజిటీతో వున్నాను" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా బోయపాటి శ్రీను, నందినీ రెడ్డి, నాని, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యాబాలన్ కి గాలి ఇటు మళ్లింది!
Subscribe to:
Posts (Atom)