e-cigarette review Ping Yahoo GOSSIPS

Tuesday, April 19, 2011

హైదరాబాదుకి 'రానా'? వద్దా?

రానా దగ్గుబాటిని చూస్తుంటే తను తెలుగు సినిమాలపై  కన్నా బాలీవుడ్ సినిమాలపైనే ప్రస్తుతం దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. హిందీ ఫీల్డు నుంచి తన కెరీర్ కి సానుకూల సంకేతాలు ఎక్కువగా వస్తుండడంతో ముందు అక్కడే ఎదగాలనుకుంటున్నాడని తెలుస్తోంది. దానికి తోడు అక్కడ అభిషేక్, హృతిక్ రోషన్ వంటి యంగ్ బ్యాచ్ హీరోలతో ర్యాపో కూడా పెంచుకుంటున్నాడు.
                   త్వరలో విడుదల కాబోతున్న తన తొలి హిందీ చిత్రం 'దం మారో దం' ప్రమోషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ విషయంలో ఈ మధ్య రాజస్థాన్, డిల్లీ, ముంబై వంటి పలు ప్రాంతాలు చుట్టివచ్చాడు. అక్కడ ప్రేక్షకుల నుంచి తనకి రెస్పాన్స్ కూడా చాలా బాగుందట. ఇవన్నీ చూస్తుంటే, ముంబై నుంచి హైదరాబాదుకి 'రానా'? వద్దా? అన్నట్టుగా అతని వ్యవహారం ఉందంటున్నారు.

బన్నీ, ఎన్టీఆర్ ల బాటలో ప్రభాస్!

బన్నీ, యన్టీఆర్ ల బాటలో ఇప్పుడు ప్రభాస్ కూడా పయనించనున్నాడు. అంటే, సినిమాల పరంగా కాదు... వాళ్లిద్దరిలా త్వరలో తనూ ఓ ఇంటి వాడు కానున్నాడు.  ఇటీవలే బన్నీ పెళ్లి చేసుకున్నాడు. యన్టీఆర్ మే 5 న చేసుకోబోతున్నాడు. వీళ్ళిద్దరిలా ప్రభాస్ కూడా ఈ సంవత్సరమే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ కి పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలెట్టారని తెలుస్తోంది. అయితే సినిమా రంగానికి సంబంధం లేని అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. తను లవ్ మేరేజ్ చేసుకోనున్నాడని మరికొన్ని వార్తలొస్తున్నాయి. మరి ఇంతకీ... తను లవ్ మేరేజ్ చేసుకుంటాడా? లేక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటాడా? అన్నది త్వరలో తెలుస్తుంది.

'కాఫీబార్' రిలీజ్ అయ్యేనా?

మన టాలీవుడ్ లో 'విషయం తక్కువ...కబుర్లు ఎక్కువ' టైపు దర్శకుల్లో గీతాకృష్ణ ముందు వరుసలో ఉంటాడు. తను తీసింది సాదాసీదా సినిమాలే అయినా, అవన్నీ ఆణిముత్యాలంటూ కబుర్లు మాత్రం మణిరత్నం రేంజ్ లో చెబుతాడు. ఇక విషయానికొస్తే, రెండున్నరేళ్ళ క్రితం 'కాఫీబార్' అనే సినిమా స్టార్ట్ చేశాడు. పూర్తి చేసి కూడా చాలా కాలమైంది. 'అదిగో రిలీజ్ ...ఇదిగో రిలీజ్' అంటూ ఎప్పటికప్పుడు స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు తప్పితే, ఇంతవరకు రిలీజ్ చేయలేకపోయాడు. ఆమధ్య మార్చిలో రిలీజ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 22 న రిలీజ్ అంటున్నారు. ఇంతకీ, ఈసారైనా రిలీజ్ అవుతుందో, లేదో!

చంద్రబాబుని కలిసిన యన్టీఆర్


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఈరోజు యువనటుడు ఎన్టీఆర్ తన తండ్రితో కలిసి వెళ్లి కలిశారు. ఈ మధ్య వీరి మధ్య వారసత్వం విషయంలో మనస్పర్థలొచ్చాయంటూ వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో వీరు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, యన్టీఆర్ కల్సింది మాత్రం వీటి గురించి మాట్లాడడానికి కాదులెండి... మే 5 న జరుగనున్న తన వివాహానికి ఆహ్వానించడానికి మాత్రమే యన్టీఆర్ కలిశాడు. తన పెళ్లి శుభలేఖను ఇచ్చి చంద్రబాబు దంపతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెళ్లి ఏర్పాట్ల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 'అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే' అంటూ యన్టీఆర్ ను సరదాగా కామెంట్ చేశారట కూడా. దానికి యన్టీఆర్ సిగ్గుతో నవ్వుకున్నాడట!
 


ఈసారైనా నిలబెట్టుకుంటాడా ?

'విక్రమార్కుడు' సినిమాలో విలన్ పాత్రలో చక్కగా నటించి గుర్తింపు తెచ్చుకున్న అజయ్, అలాగే కంటిన్యు అయివుంటే కనుక అతని కెరీర్ బాగానే వుండేది. అయితే, అత్యాశకు పోయి, తనూ హీరో అయిపోవాలనుకున్నాడు. ఆ ఆలోచనతోనే 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు' సినిమాల్లో హీరోగా నటించాడు.  కానీ, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. దాంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు చేస్తున్న అజయ్ కి ఇప్పుడు ఓ పెద్ద ఆఫర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ నటించే 'గబ్బర్ సింగ్' సినిమాలో హీరోకి సోదరుడిగా నటించనున్నాడని తెలుస్తోంది.  ఈ సినిమాకి హారీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కి బ్రదర్ గా నటించడమంటే అజయ్ కి బంపర్ ఆఫరే అనే చెప్పచ్చు. ఈ సినిమా అజయ్ కెరీర్ కి మళ్ళీ టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి!

అర్థంపర్థం లేని పొగడ్తలు

ముందు తరం నటులతో ఇప్పటి తరం నటులను పోల్చడం అనేది ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. అయితే, ఆ పోలిక కాస్త సమంజసంగా, అర్ధవంతంగా వుండాలి. అప్పుడే పోల్చిన వాళ్లకీ, పోల్చబడిన వాళ్లకీ గౌరవం. అయితే, ఇప్పుడు మన టాలీవుడ్ లో అలాంటి పోలికలేవీ లేవనే చెప్పాలి. ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్లని ఎవరెవరితోనో పోల్చేస్తున్నారు. అసలు ఎవరిని ఎవరితో పోలుస్తున్నామన్న స్పృహ కూడా కొందరికి వుండదు. ఆమధ్య 'డేంజర్' సినిమా తీస్తున్న టైం లో కలర్స్ స్వాతిని 'కాసుకోండి... మరో సావిత్రి వచ్చేస్తోంది' అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు దర్శకుడు దశరథ్ కాజల్ ని సౌందర్యతో పోలుస్తున్నాడు. "మిస్టర్ పెర్ ఫెక్ట్  సినిమాలో  కాజల్ నటన సౌందర్యను మరపించేలా వుంది. భవిష్యత్తులో తెలుగుతెరకు తను మరో సౌందర్య అవుతుంది" అంటూ ఈ రోజు ప్రెస్ మీట్ లో స్తోత్రం అందుకున్నాడు దశరథ్. అది విన్న మీడియా వాళ్లు నవ్వుకున్నారు!  

దర్శకుడు జయంత్ అలిగాడట

తీన్ మార్' సినిమా హిట్ అయిందంటూ పవన్ కల్యాణ్ నుంచీ, ఆఫీస్ బాయ్ వరకు ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా హ్యాపీగా సంబరాలు చేసుకుంటుంటే, దర్శకుడు జయంత్ మాత్రం నిర్మాత మీద అలిగి, ఆ సంబరాలకు దూరంగా ఉన్నాడట. అసలు సినిమాలు లేక, సక్సెస్ అసలే లేక ఖాళీగా వున్న దర్శకుడు జయంత్ కి ఈ సినిమా మరో లైఫ్ నిచ్చింది. కాబట్టి ఆయన ఇంకా హ్యాపీగానే వుండాలి కదా?
                 అయితే, జయంత్ అలా అలగడానికి అసలు కారణం ఏమిటంటే, ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు బాగా ప్లస్ అయ్యాయనీ, సినిమా సక్సెస్ క్రెడిట్ నంతా ఆయనకే ఇచ్చేస్తున్నారు. దానికి తోడు జయంత్ కన్నా త్రివిక్రమ్ కే ఎక్కువ పారితోషికం ఇచ్చారట. దాంతో జయంత్ ప్రస్తుతం నిర్మాత, పవన్ కల్యాణ్ లపై అలిగి, సినిమా ప్రమోషన్ కి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.
Related Posts Plugin for WordPress, Blogger...