e-cigarette review Ping Yahoo GOSSIPS

Wednesday, February 1, 2012

'శ్రద్ద' పెట్టి మరీ చేస్తున్న సినిమా!

ఆమధ్య 'వేదం' సినిమాలో అనుష్క వేశ్య పాత్ర చేసిన దగ్గర్నుంచీ చాలా మంది హీరోయిన్లు ఇలాంటి పాత్రల కోసమే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శ్రియా బెంగాలీ సినిమాలో అలాంటి వేశ్య పాత్ర ఒకటి చేస్తోంది. తాజాగా శ్రద్దాదాస్ కూడా ఈ తరహా పాత్ర చేస్తోందట. 'ఇండియా షైనింగ్' అనే బాలీవుడ్ సినిమాలో ఆమెకు అలాంటి అవకాశం వచ్చింది. ఈ పాత్ర నటిగా తన స్థాయిని పెంచుతుందని శ్రద్దా ఆశలు పెట్టుకుంది. 'ఈ కేరెక్టర్ ఎంతో అద్భుతంగా మౌల్ద్ అయింది. రెడ్ లైట్ ఏరియాలో బ్రతికే ఓ అమ్మాయి జీవితంలోని భావోద్వేగాల సమ్మేళనమే ఈ చిత్రం. ఈ పాత్ర పోషణ నాకొక చాలెంజ్. అందుకే ఎంతో శ్రద్దపెట్టి మరీ ఈ సినిమా చేస్తున్నాను' అంటోంది శ్రద్దా. అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నప్పటికీ, స్టార్ డం రానందుకు మాత్రం ఈ చిన్నది అసంతృప్తిగానే వుంది.  

కమల్ సరసన కనువిందు చేయనున్నకత్రినా

బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ ఈ వేళ హిందీ చిత్రరంగంలో బిజీ హీరోయిన్. ఆమెకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ కారణం గానే ఆమె ప్రస్తుతం తెలుగు - తమిళ భాషల్లో  సినిమాలు చేయడం లేదు. అప్పుడెప్పుడో 'మల్లీశ్వరి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మత్తెక్కించిన ఈ సుందరి ఆ తరువాత బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైపోయింది. అయితే ఇప్పుడామె కమల్ హాసన్ సరసన ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
      ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న 'తలైవన్ ఇరుకిరన్' అనే భారీ బడ్జెట్ సినిమాలో ఆమె కమల్ సరసన కనువిందు చేయనుంది. ఇక 'కొచ్చాడియాన్' సినిమాలో రజనీ కాంత్ సరసన కథానాయికగా కత్రినాకైఫ్ బాగుంటుందని భావించిన కె.ఎస్.రవికుమార్, ఆ విషయమై ఆమెని కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ...అమీర్ ల సినిమాలతో చాలా బిజీగా వున్న కత్రినా... 'ఏక్ థా టైగర్ ' అనే సినిమాలో పోరాట సన్నివేశాల్లో పాల్గొనేందుకు  ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందని తెలుస్తోంది.

టెన్షన్ పెంచుతున్న సమంతా

ఇటు సినీ పరిశ్రమ- అటు ప్రేక్షక లోకం... అందరి చూపూ సమంతా వైపే! ఎందుకంటే ఆమె దగ్గర అందం వుంది... అభినయం వుంది... అంతకు మించిన అదృష్టం వుంది. అందుకే 'ఎ మాయ చేశావే'... 'బృందావనం'... 'దూకుడు'... వంటి చిత్రాలతో ఆమె వరుస విజయాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. యువ కథానాయకుల సరసన కథానాయికగా... యువ ప్రేక్షకుల కలల రాణిగా వెలుగొందుతున్న సమంతా సక్సెస్ మంత్ర మేంటో తెలియక మిగతా  హీరోయిన్లు సతమతమైపోతున్నారట!
    ఇక సమంతా ఇవేవీ పట్టించు కోకుండా 'ఈగ' సినిమా విజయం కోసం తాను ఎదురు చూస్తున్నట్టు చెపుతోంది. ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ పై ఎవరూ చేయని అద్భుతాన్ని రాజమౌళి ఆవిష్కరించనున్నారనీ... ఈ సినిమా ఆయన స్టామిన ఏంటనేది మరోసారి నిరూపిస్తుందని అంటోంది. తనకి నాలుగో విజయాన్ని అందించనున్న ఈ సినిమా కోసం నాలుగు కళ్లతో ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఈ సినిమాతో ఆమె ఎక్కడికో వెళ్లి పోతుందనే సంగతి పక్కన పెడితే... ఈ మాటలు మాత్రం మిగతా కథానాయికలకి టెన్షన్ పెంచేస్తున్నాయట!

తాప్సీకి అలాంటి ఫీలింగ్ రాదట!

సాధారణంగా ఏ హీరో అయినా ... హీరోయిన్ అయినా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరియర్లో చకచకా ముందుకి దూసుకుపోతుంటారు. అలా కొంత దూరం పోయాక పాత్రల ఎంపికలోనూ... నటనలోనూ వాళ్లు  పరిణతి సాధిస్తారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్లు తమ గత చిత్రాలను ఓ సారి చూసుకుంటే వాటిలో లోటుపాట్లు తెలుస్తుంటాయి. అప్పుడు వాళ్లకి ఫలానా పాత్రని చేయకుండా ఉండాల్సిందనో... ఫలానా సన్నివేశంలో అలా కాకుండా ఇలా నటిస్తే బెటర్ గా వుండేదేమోననో అనిపిస్తుండటం సహజం. అయితే తాజాగా తాప్సీ ఇందుకు భిన్నంగా స్పదించింది.
    తన గత చిత్రాలు చూసినపుడు సరిగ్గాచేయలేదనే ఫీలింగ్ తనకి అస్సలు రాదని చెప్పింది. అలానే పాత్రల ఎంపిక విషయంలో కూడా తనకా ఫీలింగ్ కలగదని అంది. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడటం తనకి అలవాటు లేదనీ... ప్రస్తుతం చేసే వాటిపై శ్రద్ధ పెట్టడమే తనకి ఇష్టమని తేల్చి చెప్పింది. తన నిర్ణయాలు కూడా పర్ ఫెక్ట్ గా వుంటాయి కాబట్టి, గతం గురించి చింతించవలసిన అవసరం తనకి రాలేదని అంది. ఈ మాటలు విన్న వాళ్లు మాత్రం ఆమె ముద్దు ముద్దు మాటల్లో ఇంతటి  పరిపక్వత ఉందనుకోలేదు అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇస్తున్నారట! ఇక ప్రస్తుతం తాప్సీ 'దరువు'... 'గుండెల్లో గోదారి' చిత్రాలు చేస్తోంది.

తెలుగు తెరపై మరో హాలీవుడ్ హారర్

తెలుగు తెరని మరో హాలీవుడ్ హారర్ సినిమా పలకరించబోతోంది... ఆ సినిమా పేరే 'ది ఉమెన్ ఇన్ బ్లాక్'. ఈ సినిమాలో 'హ్యారీపోటర్' కథానాయకుడు డానియల్ రాడ్ క్లిఫ్ హీరోగా నటిస్తుండటం విశేషం. తన బిడ్డ చనిపోవడానికి కారకులైన వారిపై ఓ తల్లి ఆత్మ ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. హ్యూమర్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి జేమ్స్ వాట్కిన్స్ దర్శకుడిగా వ్యవహరించారు. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు... హిందీ... ఇంగ్లిష్ భాషల్లో కూడా ఆడియన్స్ ని కట్టిపడేయనున్నఈ సినిమాలో డానియల్ రాడ్ క్లిఫ్ తో పాటు జానెట్ మెక్ టీర్, సోఫీస్టుకీ, లిజ్ వైట్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మరిక ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ని భయపెడుతుందనేది చూడాలి.

మలేసియాలో 'నా ఇష్టం' పాట

'నా ఇష్టం' అంటూ కాడమల్లె లాంటి జెనీలియాతో కలిసి దగ్గుబాటి రానా షికారు చేస్తున్నాడు. వీలైతే అటు మలేషియాలో, లేదంటే ఇటు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆమె తో కలిసి ఆడిపాడుతున్నాడు. నిజం చెప్పాలంటే 'నా ఇష్టం' సినిమా కోసమే వీళ్ళిద్దరూ కలిసి ఇలా  కష్ట పడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయిందనీ... ఇక ఒక్క పాట మాత్రమే బ్యాలన్స్ ఉందని దర్శకుడు ప్రకాష్ తోలేటి అంటున్నారు.
     హీరో ఇంట్రడక్షన్ కి సంబంధించిన ఆ సాంగుని ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో మలేసియాలో చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి చెప్పారు. ఈ సినిమాకి చక్రి చాలా వినసొంపైన బాణీలు అందించారనీ... ప్రముఖ గాయనీ గాయకులు వాటిని ఆలపించారని అన్నారు. ఈ నెలలో ఆడియో వేడుకని వినూత్నంగా జరపబోతున్నామనీ... మార్చ్ ద్వితీయార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. 'లీడర్'... 'నేను నా రాక్షసి' వంటి పరాజయాలతో డీలా పడిన రానాకి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుందో...ఏమో..!   

'ధోని' హక్కులు పొందిన దిల్ రాజు


నటుడిగా అన్నిరకాల ప్రయోగాలు చేస్తూనే నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టిన ప్రకాష్ రాజ్, తన అభిరుచికి తగిన సినిమాలను అందించారు. ఇక ఇప్పుడు దర్శకుడిగా 'ధోని' అనే సందేశాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నేటి విద్యా వ్యవస్థ పని తీరు ... తల్లిదండ్రుల ఆలోచనలకీ- పిల్లల భావాలకి మధ్య అగాధం ఏర్పడటానికి గల కారణాలకి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు -తమిళ భాషల్లో ప్రేక్షకుల్ని పలకరించనున్న ఈ సినిమా... ఈ నెల 3 న ఆడియో వేడుకని జరుపుకుని,10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి  సంబంధించిన తెలుగు పంపిణీ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఈ రోజు ఉదయం హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన తెలియజేశారు.  
Related Posts Plugin for WordPress, Blogger...