ముంబై భామలకి ముందుగా అవకాశాలు, నాలుగు డబ్బులు తెచ్చిపెట్టేది టాలీవుడ్డు, కాకపొతే కోలీవుడ్డు. ఇక్కడ ఛాన్సులు లేకపోతే అక్కడికీ, అక్కడ లేకపోతే ఇక్కడికీ షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉంటూ వుంటారు. ఇప్పుడు తమన్నా కూడా అదే పనిలో వుంది. ముందు టాలీవుడ్ లో ట్రై చేసింది. అయితే ఇక్కడ సినిమాలు లేకపోవడంతో కోలీవుడ్ వెళ్లిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన 'కొంచం ఇష్టం-కొంచం కష్టం' సినిమా తన జాతకాన్ని మార్చేస్తుందని ఎంతగానో ఆశించింది. కానీ, అది ఢమాల్ మనడంతో తనకి తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే ఇలా అంటే, తమన్నా ఒప్పుకోదు. "ఆ సినిమా తర్వాత తెలుగులో చాలా కధలు విన్నాను. కానీ నాకు నచ్చలేదు. అందుకే ఏవీ కమిట్ కాలేదు. తమిళ్ లో మంచి ఆఫర్లు వచ్చాయి. ఏ సినిమా అయినా ఒప్పుకునే ముందు కధ, నా క్యారక్టర్, హీరో... ఈ మూడూ నాకు నచ్చాలి. అప్పుడే ఓకే చెబుతాను" అంటూ మనకి 'కధ'లు చెబుతోంది. అయినా తమన్నాకి ఇంత సీనుందా ఇక్కడ? | ||
Friday, December 31, 2010
తమన్నా కి నిజంగా అంత సీనుందా?
'అమలాపురం మంగమ్మ' వస్తోంది
మొన్నామధ్య అనుష్క 'అమలాపురం సరోజ'గా 'వేదం' సినిమా లో ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో విమలా రామన్ 'అమలాపురం మంగమ్మ'గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ 30 న విడుదల కాబోతున్న 'రంగ ది దొంగ' సినిమాలో ఆమె చేసిన పాత్ర పేరు అదే. అందులో తను పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కనిపిస్తుంది. చీటికి మాటికి 'అయ్ బాబోయ్... ' అంటూ గోదావరి యాసలో మాట్లాడుతూ అందర్నీ నవ్విస్తుందట. ఇంకో విశేషమేమిటంటే, ఆ సినిమా షూటింగులో అందరూ తనని ఈ పోలీస్ డ్రెస్ లో చూసి విజయశాంతి తో పోల్చేవారట. "విజయశాంతి నటించిన యాక్షన్ సినిమాలన్నీ చూసాను. ఆవిడెక్కడ... నేనెక్కడ? ఆమెను ఇన్స్ పెరేషన్ గా తీసుకుని చేసాను" అంటోంది అమలాపురం మంగమ్మ. | ||
Thursday, December 30, 2010
ఆమిర్ ఖాన్, రాజమౌళి మీటింగ్!
దర్శకుడు రాజమౌళి ఇప్పుడు చాలా ఎగ్జయిటింగ్ గా వున్నాడు. ఎంత అంటే, మాటల్లో చెప్పలేనంత! ఎందుకంటే, తాను ఎంతో అభిమానించే ఓ స్టార్ ని కలుసుకోబోతున్నాడు. రాజమౌళి అభిమానించే ఆ హీరో ఎవరనుకుంటున్నారా? మరెవరో కాదు... బాలీవుడ్ లో ప్రయోగాత్మక, సాహసాత్మక సినిమాలు తీసే హీరో ఆమిర్ ఖాన్! అవును... రాజమౌళి రేపు (డిసెంబర్ 31 ) ఆమిర్ ని కలవనున్నాడు. "వావ్...చాలా ఎగ్జయిటింగ్ గా వుంది. ఆమిర్ ని రేపు కలుస్తున్నాను. అలాగని చెప్పి ఏదో సినిమా చేస్తున్నామని ఏవో ఊహించేసుకోకండి" అంటున్నాడు రాజమౌళి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, 'మగధీర' సినిమా గురించి తెలుసుకుని, ఆ సినిమా చూడాలన్న కోరికను వ్యక్తపరిచాడు ఆమిర్. దాంతో ప్రింట్ పంపించి చూపించారు. చూసిన వెంటనే ఫోనే చేసి, రాజమౌళిని ఆమిర్ ఎంతగానో అభినందించాడట. ఆ సందర్భంగా 'మిమ్మల్ని క్యాజువల్ గా కలవాలని వుంది' అని రాజమౌళి అనగానే, 'మోస్ట్ వెల్ కమ్' అంటూ మనస్పూర్తిగా ఆహ్వానించాడట. సో .. రేపు జరగబోయే ఈ మీటింగ్ ఓ పెద్ద హిందీ సినిమా ఆవిర్భావానికి దారితీయచ్చేమో! | ||
'నో సీనియర్స్' అంటున్న అల్లు శిరీష్
యంగ్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కి సినిమాల పట్ల మంచి నాలెడ్జ్ వుంది. ఇంటర్నేషనల్ సినిమా గురించి, సినిమా టెక్నాలజీ గురించీ కూడా బాగా మాట్లాడతాడు. అయితే అతనికి సినిమా నిర్మాణం కన్నా మీడియా బిజినెస్ అంటే ఎక్కవ ఇష్టమట. అందుకే, 'సౌత్ స్కోప్' పేరుతో ఓ ఇంగ్లిష్ సినిమా మేగజైన్ నడుపుతున్నాడు. సదరన్ సినిమాని ఎక్కువగా కవర్ చేస్తారిందులో. ఈ మేగజైన్ తరఫున ప్రతి ఏడూ సినిమా తారల ఫోటోలతో కూడిన కేలెండర్ ఒకటి వేస్తుంటాడు. దానికోసం బాగా ఖర్చు పెట్టి, ప్రముఖ తారలతో ఫొటో సెషన్లు కూడా చేయిస్తుంటాడు. అయితే ఈ ఏడాది సీనియర్స్ ని వదిలేసి కేవలం యంగ్ స్లాట్ తోనే కేలండర్ వేస్తున్నాడు. హీరోలు అల్లు అర్జున్, రానా, నాగ చైతన్య, జీవా, కార్తి, దిగంత్, హీరోయిన్లు సమంతా, కాజల్, తమన్నా, శ్రియ, శృతి హాసన్, నిధి లతో కేలండర్ ని రూపొందిస్తున్నాడు. దీని కోసం అల్లు అర్జున్ తన హెయిర్ స్టయిల్ కూడా మార్చుకున్నాడు. ఈ కేలండర్ ని జనవరి ఫస్ట్ వీక్ లో ఓ వేడుకలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ మేగజైన్ మాత్రం చాలా లాస్ లో నడుస్తోందని అందులో పనిచేసే వాళ్లు చెబుతున్నారు! | ||
బోయపాటి శ్రీను సినిమా ఎప్పుడు?
అసలు ఒక పెద్ద హిట్ సినిమా పడగానే ఆ సినిమా డైరెక్టర్ యమా బిజీ అయిపోతాడు. బోయపాటి శ్రీను విషయంలో ఇది రివర్స్ అయిందనే చెప్పాలి. 'సింహా' రిలీజ్ అయి, సూపెర్ హిట్ అవగానే, అతనికి చాలా ఆఫర్లు వచ్చాయి. మూడు కోట్లు ఆఫర్ చేసిన వాళ్లు కూడా వున్నారు. అయితే, దేనికీ కమిట్ కాకుండా యన్టీఆర్ తో చేయడానికే అతను కమిట్ అయ్యాడు. అయితే, ఆ ప్రాజక్టు 'అదిగో...ఇదిగో' అంటూ ఊరిస్తోందే కానీ, మొదలవడం లేదు. స్క్రిప్ట్ దగ్గరే ఏదో ప్రాబ్లం వచ్చిందంటున్నారు. దాంతో అది ముందుకి సాగడం లేదు. ప్రస్తుతం యన్టీఆర్ 'శక్తి' సినిమా పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈలోగా మరో వార్త. చిరంజీవి 150 వ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడని. అయితే, అదీ కన్ఫర్మ్ కావడం లేదు. ఏదైనా ఒక పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టరు ఇలా ఎనిమిది నెలల నుంచి ఖాళీగా వుండడం మాత్రం బాగోలేదు. ఒక విధంగా అది అతని స్వయంకృతాపరాధమేనేమో! | ||
నాగ్ 'రాజన్న' కోసం భారీ సెట్స్
ఇటీవల విడుదలైన 'రగడ' సినిమా మంచి కలక్షన్లు వసూలు చేస్తుండడంతో నాగార్జున ఇప్పుడు మంచి జోష్ లో వున్నారు. ఈ నేపధ్యంలో తన తదుపరి చిత్రం 'రాజన్న' షూటింగ్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే నిజాం కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్స్ వేయడం జరిగిందని నాగ్ చెప్పారు. చిత్ర పరిశ్రమ బంద్ వల్ల షూటింగ్ ఆగిందనీ, లేకపోతే ఈపాటికి ఆ సినిమా షూటింగులోనే ఉండేవాడినని ఆయన అన్నారు. 1940 ల నాటి కధ ఇదనీ, తెలంగాణా వీరునిగా ఇందులో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందనీ చెప్పారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారనీ, రాజమౌళి యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేస్తారనీ నాగ్ చెప్పారు. ఇదిలావుంచితే, ఫిబ్రవరి 12 నుంచి శ్రీనివాస రెడ్డి డైరెక్షన్ లో రూపొందే సోషియో ఫాంటసీ చిత్రం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. | ||
తాప్సీకి రాఘవేంద్ర రావు సెంటిమెంట్!
దర్శకుడు రాఘవేంద్ర రావు హస్తవాసి చాలా మంచిదంటారు టాలీవుడ్ లో. అంటే, ఎవరైనా ఆయన సినిమాలో యాక్ట్ చేస్తే ఇక వాళ్లు స్టార్లు అయిపోతారని సెంటిమెంట్. ఇప్పుడిది తాప్సి విషయంలోనూ నిజమైంది. ఆయన తెలుగుతెరకు పరిచయం చేసిన తాజా గ్లామర్ తాప్సి. 'ఝుమ్మంది నాదం' సినిమా ద్వారా ఆమె అందచందాలను ఎక్కడా వదలకుండా వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించి, ఆమెకో చక్కని ఫ్లాట్ ఫాం ను ఏర్పాటు చేసారాయన. ఒళ్లంతా అందాన్ని నింపుకున్న ఈ సుందరాంగి ప్రస్తుతం 'వస్తాడు నా రాజు', 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమాలలో నటిస్తోంది. కాగా, తాజాగా యన్టీఆర్ తో నటించే అవకాశాన్ని కూడా తాప్సి పొందినట్టు తెలుస్తోంది. యన్టీఆర్ తో సురేందర్ రెడ్డి రూపొందించే 'రచ్చ' చిత్రంలో ఈమె నటించనుంది. ప్రస్తుతం ఓ తమిళ చిత్రం షూటింగ్ కోసం ఈ భామ పాండిచ్చేరిలో ఉంది. | ||
Subscribe to:
Posts (Atom)