Monday, April 25, 2011
మరో 'బొమ్మరిల్లు' తీస్తున్న దిల్ రాజు?
సంగీత దర్శకురాలిగా కౌసల్య
సమీరా రెడ్డికి ఇంతలోనే ఏమైంది?
అసలు విషయం ఏమిటంటే, ఈమధ్య తన స్నేహితురాలి పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి తనే చూసిందట. దాంతో ఈ పెళ్లి తంతు మీద చిరాకు, విసుగు వచ్చేశాయట. దానికి తోడు, పెళ్లి అనే బంధంతో ఒకరికి భారం అవడం, మరొకరు మనకి బరువవడం తనకిష్టం లేదట. అందుకే పెళ్లికి దూరంగా వుండాలనుకుంటున్నట్టు చెబుతోంది. పెళ్లీడుకొచ్చిన పిల్ల ఇలా మాట్లాడడంతో, సమీరా ఎక్కడో దెబ్బతినే ఉంటుందని బాలీవుడ్ లో కామెంట్లు వినపడుతున్నాయి.
'బద్రీనాథ్' కి మూడు పాటలు బ్యాలెన్స్
తమన్నాకి, చైతన్యకి మధ్య గొడవా?
"అందులో నా పేరు మహాలక్ష్మి. తన పేరు బాలు. ప్రతి చిన్న విషయానికీ ఇద్దరం పోట్లాడుకుంటూ వుంటాం. మరోలా చెప్పాలంటే కార్టూన్ ఫిలిం 'టాం అండ్ జెర్రీ' టైపన్న మాట. మామధ్య ఇలా చిటపటలున్నా.. చూసే వాళ్లకి మాత్రం మంచి ఫన్ గా వుంటుంది" అంటోంది తమన్నా. ఈ సినిమా మే మొదటి వారంలో రిలీజ్ అవుతోంది. చాలా కాలం తర్వాత వస్తున్న తన తెలుగు చిత్రం కాబట్టి, దీని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. దీంతో బాటు 'బద్రీనాథ్', 'ఊసరవెల్లి' చిత్రాలు తనని టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ ని చేసేస్తాయని ఆశిస్తోంది తమన్నా.
రేపటి నుంచి తిరిగి షూటింగులు
గత పద్దెనిమిది రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె ఓ కొలిక్కి వచ్చింది. సమ్మె విరమించి, మంగళవారం నుంచి వీరు షూటింగులలో పాల్గొంటారు. నిర్మాతలకు, ఫిలిం ఫెడరేషన్ కూ మధ్య ఈ రోజు జరిగిన చర్చలు ఫలించి, ఒప్పందం కుదిరింది. కార్మికులకు 32 శాతం మేర వేతనాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించారు. కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై పలుసార్లు నిర్మాతలతో చర్చలు జరిగినా, వేతనాల పెంపుపై ప్రతిష్టంభన ఏర్పడింది. తమ డిమాండ్ మేర వేతనాలు పెంచాల్సిందేనని కార్మికులు పట్టుపట్టడంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. ఇదిలా ఉంచితే, తమను సంప్రదించకుండా నిర్మాతల మండలి ఒప్పందాలు చేసుకుంటోందని చిన్న నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై పలుసార్లు నిర్మాతలతో చర్చలు జరిగినా, వేతనాల పెంపుపై ప్రతిష్టంభన ఏర్పడింది. తమ డిమాండ్ మేర వేతనాలు పెంచాల్సిందేనని కార్మికులు పట్టుపట్టడంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. ఇదిలా ఉంచితే, తమను సంప్రదించకుండా నిర్మాతల మండలి ఒప్పందాలు చేసుకుంటోందని చిన్న నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
రాజమౌళి సినిమాలో నితిన్
Subscribe to:
Posts (Atom)