Wednesday, February 8, 2012
సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ఓకే చేసిన బన్నీ
శృంగార సన్నివేశాన్ని కళాత్మకంగా తీస్తాడట!
మార్చ్ 20 న ముంబయ్ శివారులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు యూనిట్ వాళ్లు చెబుతున్నారు. కరీనా ఆ సీన్లో అర్జున్ తో కలిసి సిగరెట్ కాలుస్తూ... మందు కొడుతూ... చివర్లో 'బెడ్' షేర్ చేసుకుంటుంది. ఈ సన్నివేశాన్ని వల్గారిటీ లేకుండా... చాలా కళాత్మకంగా చిత్రీకరిస్తాననీ, ఆ సీన్ షూట్ చేసేటప్పుడు రూంలో తనతో బాటు కేవలం ముగ్గురు అసిస్టెంట్స్ మాత్రమే ఉంటారని కరీనాను దర్శకుడు మాధుర్ కన్విన్స్ చేశాడట. పైగా, ఆ సన్నివేశం వివరాలు ఎక్కడా వెల్లడించమని రాతపూర్వకంగా తన అసిస్టెంట్స్ ముగ్గురి నుంచీ 'కాన్ఫిడెన్షియాలిటీ కాంట్రాక్ట్' కూడా తీసుకుంటాడట.
ఈ విషయాన్ని మాధుర్ చెప్పకపోయినా తన యూనిట్ వాళ్ల ద్వారా మీడియాకు లీక్ చేశాడు. అంటే, సినిమాకు హైప్ తెచ్చుకోవడానికి ఇదో రకం పబ్లిసిటీయేమో!
ఇద్దరు హీరోలతో మధుర శ్రీధర్ చిత్రం
యువ నటులు వరుణ్ సందేశ్, సాయిరామ్ శంకర్ కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి మధుర శ్రీధర్ దర్శకత్వం వహిస్తారు. గతంలో ఆయన 'స్నేహగీతం', 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి అభిరుచి గల చిత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈ ప్రేమకథా చిత్రంలో 'షాపింగ్ మాల్', 'జర్నీ' చిత్రాల కథానాయిక అంజలి హీరోయిన్ గా నటిస్తుందట. 'ఇట్స్ మై లవ్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించిన మున్నా వెంకటకృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలో దీని షూటింగు ప్రారంభమవుతుంది.
'రచ్చ' షూటింగుకి అంతరాయం
ఈ 23 నుంచి 'ఎవడు' షూటింగ్
మంచు లక్ష్మికి కొత్త అనుభూతి
చిన్న సినిమా తీస్తున్న పెద్ద దర్శకుడు!
తమ వేతనాలు పెంచాలంటూ తమిళ చిత్ర పరిశ్రమలోని కార్మికులు గత పది రోజుల నుంచీ సమ్మె చేస్తుండడంతో తమిళ సినిమాల షూటింగులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇలా నిలిచిపోయిన చిత్రాలలో విజయ్, కాజల్ జంటగా మురుగదాస్ రూపొందిస్తున్న 'తుపాకి' సినిమా షూటింగు కూడా ఉంది. దాంతో ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో తెలియక తారలు, దర్శకులు సతమతమవుతున్నారట. ఈ నేపథ్యంలో ఈ సమయాన్ని మరో కార్యక్రమానికి వినియోగించుకోవాలని దర్శకుడు మురుగదాస్ నిర్ణయించుకున్నాడు. పది నిమిషాల పాటు సాగే ఓ షార్ట్ ఫిలిం రూపొందించే ప్లాన్ చేస్తున్నాడు. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథగా దీనిని తెరకెక్కిస్తాడట. ప్రస్తుతం కొత్త హీరో హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఇటీవల తన ఇంటి సమీపంలో కొంతమంది టీనేజర్లు కలిసి మాట్లాడుకోవడం మురుగదాస్ చెవిన పడిందట. వారి సంభాషణ నుంచే ఈ కథకు ఐడియా తట్టిందట! | ||||
Subscribe to:
Posts (Atom)