
Sunday, January 29, 2012
త్రిషను చూసి జలసీ ఫీలవుతున్నారా?

రామ్ చరణ్ ప్రశంసలందుకున్న చిత్రం

'చాణక్యుడు'గా యువ నటుడు తనీష్

బాబాసైగల్ తో 'శృతి' కలిసింది!
![]() | ||
తన సినిమాలు హిట్టవకపోయినా, తను సింగర్ గా హిట్టవుతున్నందుకు మాత్రం శృతి హాసన్ ఇప్పుడు చాలా హ్యాపీగా వుంది. అటు ఆర్టిస్టుగా పలు చిత్రాలలో నటిస్తూనే, గాయనిగా కూడా తన ఆసక్తిని శృతి ప్రదర్శిస్తూనే వుంది. తను నటించే సినిమాలలోనే కాకుండా ఇతరుల చిత్రాలలో కూడా పాటలు పాడుతోంది. ఆ క్రమంలో తాజాగా బాబా సైగల్ తో కూడా కలిసి ఓ పాట పాడింది. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చిన 'ముప్పోజుతుం ఉన్ కర్పనైగళ్' అనే చిత్రంలో బాబాతో కలిసి తన గళం కలిపింది. ఇదొక ఫోక్ సాంగ్ అనీ, బాబాతో కలిసి పాడడం ఎంతో హ్యాపీగా ఉందనీ శృతి అంటోంది. చిన్నప్పటి నుంచీ తను బాబా సైగల్ కి ఫ్యాన్ నని చెబుతోంది. | ||
![]() | ||
* గోవా బ్యూటీ ఇలియానా తాను నటిస్తున్న తొలి హిందీ చిత్రం బర్ఫీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందట. రణబీర్ కపూర్, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. * చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'ఋషి' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులోని ప్రసాద్ ఐ మాక్స్ లో జరిగింది. ప్రముఖ నటుడు కమలహాసన్ వీటిని విడుదల చేయగా, డి.రామానాయుడు తొలి సీడీని స్వీకరించారు. * సినీ తారల క్రికెట్ టోర్నీ (సీసీఎల్- 2) లో నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు గెలిచి సెమీస్ లోకి ప్రవేశించింది. వెంకటేష్ నేతృత్వంలోని తెలుగు వారియర్స్ టీం బెంగాల్ టైగర్స్ ను మట్టికరపించింది. * దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్ వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 3 న హైదరాబాదు జూబ్లీ హిల్స్ లోని ఎఫ్.ఎన్.సీసీలో మిత్రులకు పార్టీ ఇస్తున్నాడు. మీడియాను కూడా పిలుస్తున్నాడట. * ప్రముఖ గీత రచయిత వేటూరి పేరుపై విజయనగరంకు చెందిన ఆత్రేయ స్మారక కళాపీఠం ఇచ్చే వార్షిక పురస్కారాన్ని ఈ ఏడాది సంగీత దర్శకుడు మణిశర్మకు ప్రదానం చేశారు. వేటూరి జయంతి సందర్భంగా నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. | ||
Monday, January 23, 2012
'బిజినెస్ మేన్' ఫ్లాప్ కిందే లెక్కట!

రాంగోపాల్ వర్మ వరస చూస్తుంటే తన శిష్యుడు పూరీ జగన్నాథ్ కి బ్రాండ్ అంబాసడార్ గా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎవరినీ, ఏ చిత్రాన్నీ, ఎప్పుడూ ప్రశంసించని వర్మ ఈమధ్య పూరీ జగన్నాథ్ ని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. పూరీ రూపొందించే ప్రతి సినిమా అతనికి ఓ కళాఖండం గా కనిపిస్తోంది. 'బిజినెస్ మేన్' సినిమా విడుదలైనప్పటి నుంచీ దానిని ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాడు. ఆ సినిమా 'ఆహా... ఓహో...' అంటూ ట్విట్టెర్ ద్వారా పబ్లిసిటీ గుప్పేస్తున్నాడు. తాజాగా మరో అడుగు ముందుకేసి, మరో పోస్ట్ ఇచ్చాడు. "ఇప్పుడే పూరీ జగన్నాథ్ 'బిజినెస్ మేన్-2' స్టోరీ చెప్పాడు. 'బిజినెస్ మేన్-2' ముందు 'బిజినెస్ మేన్' సినిమా ఫ్లాప్ కిందే లెక్క. నమ్మశక్యం కానంతగా 'బిజినెస్ మేన్ -2'లో మహేష్ క్యారెక్టర్ని పూరీ మౌల్ద్ చేశాడు. ఈ క్యారెక్టర్ ముందు 'బిజినెస్ మేన్' లోని మహేష్ క్యారెక్టర్ దిగదుడుపే!" అంటున్నాడు వర్మ. ఏమైనా, ఎవర్ని ఎలా లేపాలో... వర్మకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు కదా? | |
ఆమెకింకా పెళ్లీడు రాలేదట!

అయితే కెరియర్ మంచి ఊపు మీదున్నప్పుడు హటాత్తుగా పెళ్లి చేసుకుని సైడై పోయిన హీరోయిన్లూ లేకపోలేదు... పెళ్లి విషయాన్ని దాచేసి కామ్ గా కథానాయికలుగా కాలం వెళ్లదీసిన వారూ లేకపోలేదు. ఇక ఈ తరం హీరోయిన్ ల విషయానికొస్తే కెరియర్ గ్రాఫ్ కాస్త బాగుండగానే జెనీలియా త్వరలో ఓ ఇంటిది కాబోతోంది. ఇక కనిపించింది గదా అని 'అశిన్' దగ్గర పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తే, ఒక్క సారిగా ఆమె అదిరి పడిందట! ఇప్పుడిప్పుడే తాను బాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్నాననీ...తను సాధించవలసింది ఇంకా చాలా ఉందని చెప్పింది. కాసుల గురించే కాదు...కరిగి పోతున్న వయసు గురించి కూడా ఆమె కాస్త ఆలోచిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.
ప్లీజ్... మళ్లీ ఒకే ఒక్క చాన్స్ !

ఈ విషయమై రాజాని కదిలిస్తే...కెరియర్ పై సీరియస్ నెస్ కనబరుస్తూ మాట్లాడాడు. తనకి అవకాశాలు బానే వస్తున్నాయనీ... అయితే కథని ఎంపిక చేసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పాడు. మళ్లీ ఓ సరైన హిట్ పడితే తన సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. ఏదేవైనా ఆలస్యం...అమృతం..విషం...అనే సూత్రం సినిమా ఫీల్డ్ కే ఎక్కువగా వర్తిస్తుంది. అలాంటిది...ఆదమరిచి ఉంటే ఆరామ్ గా సినిమా ఫంక్షన్లకి మాత్రమే తిరగాల్సి వస్తుంది మరి!
రణబీర్, కాజల్ జంటగా హిందీ 'బిజినెస్ మేన్'?

నిత్యా మీనన్ కు '50% లక్'

సిద్ధార్దకి జ్ఞానోదయమైంది!

ఇదిగో... ఇలాంటి పరిస్థితుల్లోనే సిద్ధూకి జ్ఞానోదయమైంది. తమిళ సినిమాలను నిర్లక్ష్యం చేయడమే తన స్థితికి కారణమని అతనికి అర్ధమైపోయింది. దాంతో ఇప్పుడక్కడ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తన తెలుగు సినిమాలను తమిళ్ లో విడుదలయ్యేలా చూసుకోవడమే కాకుండా, స్ట్రెయిట్ తమిళ్ సినిమాలు కూడా చేయాలని డిసైడై పోయాడట! పనిలో పనిగా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి కూడా టచ్ లోనే ఉంటున్నాడు. యువతరం కథానాయకుడిగా కెరియర్ పై ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవడం మంచిదే... కాకపోతే, 'తట్టు తగిలితేగాని తత్వం బోధపడదని' మరోమారు నిరూపించాడు
బిర్యానీ భామ ఫుల్ బిజీ అట!

దాంతో నిరాశ పడకుండా నెమ్మదిగా తమిళ తెరను టచ్ చేసింది. అంతే వరస విజయాలు ఆమె వాకిట్లో కొచ్చి వాలాయి. ప్రస్తుతం డేట్స్ ఎడ్జస్ట్ చేయడానికి కూడా బిందు మాధవి ఇబ్బంది పడుతోందట! తమిళ ప్రేక్షకులు ఆశించే అందం...ఆకర్షణ ఉండటం వల్లే అక్కడ ఆమె అంత బిజీ కావడానికి కారణమని అంటున్నారు. ఈ హడావిడి అంతా చూస్తుంటే, ఆమె రచ్చ గెలిచి ఇంటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల రాత ఏ భాషలో ఉంటుందో తెలియదుగాని, అది సక్రమంగా ఉంటే ఏ భాషలోనైనా రాణించవచ్చనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

* సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న 'ఎస్.ఎం.ఎస్' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో ఘనంగా జరిగింది. మహేష్ బాబు ఆడియోను విడుదల చేయగా, వి.వి .వినాయక్ తొలి సీడీని స్వీకరించారు. కృష్ణ, విజయనిర్మల కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
* ఆది పినిశెట్టి కథానాయకుడుగా వసంత బాలన్ దర్శకత్వంలో రూపొందిన అనువాద చిత్రం 'ఏకవీర' డీటీయస్ పనులు పూర్తయ్యాయి. 300 ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఆధారంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత చెప్పారు.
* 'జల్సా' చిత్రం తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'సరదా' అనే టైటిల్ నిర్ణయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
* సిద్ధార్థ్, అమలాపాల్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'లవ్ ఫెయిల్యూర్' చిత్రం ఆడియోను ఈ నెల 28 న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సిద్ధూ ఓ పాట కూడా పాడాడు. వేలంటైన్స్ డే కి చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.
మహేష్ బాబు పేరు మారిపోయిందట!

తెరమరుగవుతున్న తెలుగు విలనిజం!

కథానాయకుడు తన ఆట పాటలతో...హీరోయిజంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటే, విలన్ మాత్రం తన విలక్షణమైన నటనతోనే ఎక్కువ మార్క్ లు సంపాదించుకోవలసి వస్తుంది. విలన్ల మేనరిజమే వాళ్లకి ప్రేక్షకుల హృదయాల్లో ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. ఎస్.వి.రంగారావు...రాజనాల...నా
ఆనాటి విలన్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఎస్.వి. రంగారావు విషయానికొస్తే విలనిజం లో ఆయన నభూతో...నభవిష్యతి అనిపించారు. కథానాయకుడు ఎంతటివాడైనా ఒక చిన్నపాటి మాట విరుపుతో అదిలిస్తూ అధిగమించేవాడు. పౌరాణికాల్లోనే కాదు... జగమెరిగిన జానపద మంత్రగాడిగా జానపదాల్లోనూ ఎస్.వి. రంగారావు ఎదురులేని విలనే! ఆ సమయంలోనే కరుకైన కండలతో, చురుకైన చూపులతో యంగ్ విలన్ గా తన దైన ముద్ర వేశాడు రాజనాల. రాజ్యకాంక్షతో రగిలిపోయే ప్రతినాయకుడిగా ఆయన పండించిన విలనిజాన్ని అంత తేలిగ్గా ఎవరూ మరిచిపోలేరు.
ఇక సాంఘికాల విషయానికొస్తే... గ్రామపెద్దగా కుటిల రాజకీయాలను చేసే విలన్ గా నాగభూషణం చూపిన వైవిధ్యానికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పల్సిందే. ఊతపదాల్ని ఉపయోగిస్తూ విలనిజాన్ని రక్తికట్టించిన తొలి విలన్ నాగభూషణమేనని చెప్పొచ్చు. ఆయన సంభాషణల్లోని గమ్మత్తైన విరుపు ... కామెడీ కోటింగ్ తో అందించిన విలనిజం ఆనాటి ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. ఇక ప్రతినాయకుడిగా రావుగోపాలరావు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి కాంబినేషన్ లో ఆయన చేసిన పాత్రలు అనితర సాధ్యాలని చెప్పొచ్చు. అలా తరాలవారీగా తరగని విలనిజాన్ని పండించిన ఘనత రావుగోపాలరావుకే దక్కింది.
విలక్షణమైన విలనిజంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు నూతన్ ప్రసాద్. అనుకోని ప్రమాదం ఆయన్ని ఆ స్థానానికి దూరం చేయగా, కోట శ్రీనివాసరావు వెలుగులోకి వచ్చారు. విభిన్నమైన ఆయన మేనరిజానికి ప్రేక్షకులు బ్రహ్మరధంపట్టారు. కోట శ్రీనివాసరావు తర్వాత అడపాదడపా ఫ్యాక్షన్ సినిమాల్లోవిలన్ గా కనిపించిన జయప్రకాష్ రెడ్డిని మినహాయిస్తే, ఇక విలన్ లుగా వీలైనన్ని కొత్తముఖాలే కనిపిస్తాయి. జూ.ఎన్టీఆర్ , మహేష్ బాబు, రాం చరణ్, అల్లు అర్జున్, నితిన్, రామ్ తదితర యంగ్ హీరోల కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమాలోనూ మన తెలుగు విలన్ల జాడ కనిపించడం లేదు. ఇక్కడ నుంచే మనకి పరభాషా విలన్ల ప్రభావం పెరగడం, తెలుగు విలన్ లు తెరమరుగు కావడం కనిపిస్తుంది.
ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్, ఆశిష్ విద్యార్ధి, షాయాజీ షిండే, సోనూసూద్, దేవ్ గిల్ తదితరులు విలన్లుగా ఈ తరం సినిమాలను ప్రభావితం చేస్తున్నారు. ట్రెండ్ తో పాటు విలనిజం మారుతుందని సరిపెట్టుకోలేం. పరభాష విలన్లని దిగుమతి చేసుకోవడం వైవిధ్యంగా భావించలేం. నేటి సినిమాల్లో కథ కన్నా ఖర్చుకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుండటం వల్ల, కొత్తదనం పేరుతో చేస్తోన్న ప్రయోగాల వల్ల విలనిజం రూపురేఖలు మారిపోతున్నాయి. ఆనాటి విలనిజంలో వ్యూహాలు కనిపిస్తే, ఈనాటి విలనిజం ఉన్మాదం అనిపిస్తుంది. ఈనాటి విలన్ ల వింత గెటప్ లు- వికృత చేష్టలు చూస్తుంటే వారి మానసిక స్థితిపై సగటు ప్రేక్షకుడికి కూడా సందేహం కలగక మానదు.
ఆ రోజుల్లో హీరోలు -విలన్లు నువ్వా? నేనా? అన్నట్టు సమఉజ్జీలుగా ఉండే వాళ్లు. ఇక, ఈతరం హీరోలకి గానీ... వాళ్లతో తలపడే విలన్లకి గాని ఎక్కడా పొంతన ఉండదు. లేడిపిల్ల లాంటి హీరో... సింహం లాంటి విలన్ ని చితక బాదేయడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. పోతే, ప్రాంతమేదైనా...భాష ఏదైనా...టాలెంట్ ఉన్న వాళ్లే ఇక్కడ రాణిస్తారనేది నూటికి నూరు శాతం నిజం. అయితే విలన్ పాత్రల్లో విజ్రుంభించగల ప్రతిభావంతులెందరో తెలుగులో ఉన్నారు. వాళ్లకి అవకాశమిచ్చి ప్రోత్సహిస్తే కథలో కొత్తదనమే కాదు, తెలుగుదనమూ ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలనీ...గత వైభవం తిరిగిరావాలని ఆశిద్దాం.
ఇమ్రాన్ ఖాన్ పక్కన ఇలియానా

మరో స్క్రిప్ట్ కి ఓకే చెప్పిన గోపీచంద్

రెండేళ్ల క్రితం రామ్ హీరోగా 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీవాస్, తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఇందులో గోపీచంద్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. యాక్షన్ ఎలిమెంట్ తో తయారుచేసిన ఈ కథ గోపీచంద్ కి బాగా నచ్చడంతో చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడట. గతంలో రవితేజ, త్రిష జంటగా 'కృష్ణ' చిత్రాన్ని నిర్మించిన శ్రీ లక్ష్మి నరసింహ విజువల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగు త్వరలో ప్రారంభమవుతుంది. మరోపక్క భూపతి దర్శకత్వంలో కూడా గోపీచంద్ ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే! | |
చిరంజీవిపై మళ్లీ విరుచుకుపడ్డ బాలకృష్ణ

నిన్నటి దాకా సినిమా రంగంలో ఒకరిని మరొకరు గౌరవించుకుంటూ, ఆలింగనాలు చేసుకున్న చిరంజీవి-బాలకృష్ణ, ఇప్పుడు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. రాజకీయాలలో ఇద్దరూ చెరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పైచేయి కోసం ఇద్దరూ పోటీపడుతున్నారు. 'చిరంజీవిపై పోటీకి సై' అంటూ నిన్న బాలకృష్ణ ప్రకటించడంతో, ఈ రోజు చిరంజీవి దానిని లైట్ తీసుకున్నారు. బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదనీ, దానిని తాను లైట్ తీసుకుంటానని ఈ రోజు తిరుపతిలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంచితే, బాలకృష్ణ మాత్రం చిరంజీవిపై విమర్శల స్పీడు బాగా పెంచేశారు. ఈవేళ విశాఖపట్నంలో మరింత దూకుడు ప్రదర్శించారు. తనను ఒకరు బాలుడు అన్నారనీ, అలాంటి వారు తనని ఒక వైపే చూశారనీ, కావాలంటే తన మరో రూపం కూడా చూపిస్తాననీ బాలకృష్ణ ఆవేశంగా అన్నారు. 'కోట్లాది రూపాయలకు పార్టీని అమ్ముకున్న వాళ్ళా నన్ను విమర్శించేది?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కావాలని కొందరు కలలు కంటున్నారనీ, అలాంటి వారు ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరితూగరనీ, చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ పరోక్షంగా విమర్శించారు. ఈ మాటల యుద్ధం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి! | |
Subscribe to:
Posts (Atom)