e-cigarette review Ping Yahoo GOSSIPS: సిద్ధార్దకి జ్ఞానోదయమైంది!

Monday, January 23, 2012

సిద్ధార్దకి జ్ఞానోదయమైంది!

తెలుగు తెర పై నట వారసులు కదం తొక్కుతున్న సమయంలో తమిళ తెర నుంచి సడన్ గా ఇటు దూకేసి, ఇక్కడ హీరోగా సెటిలైపోయాడు సిద్ధార్థ. 'బొమ్మరిల్లు'... 'నువ్వొస్తానంటే ...నేనొద్దంటానా!' వంటి సినిమాలతో యూత్ లో తన కంటూ ఓ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం... వీలైతే పాటలు కూడా పాడేయడం సిద్ధూ స్పెషాలిటి. అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగే తెచ్చుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో ఇతగాడి జోరు కాస్త తగ్గినట్టుగానే కనిపిస్తోంది. వరసగా పలకరిస్తున్న పరాజయాలే అందుకు కారణమై ఉండొచ్చు.
    ఇదిగో... ఇలాంటి పరిస్థితుల్లోనే సిద్ధూకి జ్ఞానోదయమైంది. తమిళ సినిమాలను నిర్లక్ష్యం చేయడమే తన స్థితికి కారణమని అతనికి అర్ధమైపోయింది. దాంతో ఇప్పుడక్కడ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తన తెలుగు సినిమాలను తమిళ్ లో విడుదలయ్యేలా చూసుకోవడమే కాకుండా, స్ట్రెయిట్ తమిళ్ సినిమాలు కూడా చేయాలని డిసైడై పోయాడట! పనిలో పనిగా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి కూడా టచ్ లోనే ఉంటున్నాడు. యువతరం కథానాయకుడిగా కెరియర్ పై ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవడం మంచిదే... కాకపోతే, 'తట్టు తగిలితేగాని తత్వం బోధపడదని' మరోమారు నిరూపించాడు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...