![]() | ||
రవితేజ హీరోగా రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ హీరోయిన్లుగా రూపొందుతున్న 'మిరపకాయ్' చిత్రాన్ని జనవరి 12 న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల హైదరాబాదులో ప్రెస్ కి తెలిపారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీనిని రూపొందించామనీ, ఇటీవల విడుదలైన ఆడియో మంచి హిట్ అయిందనీ నిర్మాత చెప్పారు. రవితేజ పెర్ఫార్మెన్స్, హరీష్ టేకింగ్, తమన్ సంగీతం చిత్రాన్ని హిట్ చిత్రంగా నిలుపుతాయని ఆయన తెలిపారు. |
Wednesday, December 29, 2010
జనవరి 12 న 'మిరపకాయ్'
Labels:
RAVI TEJA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment