![]() | ||
అందచందాలు ఉండగానే సరిపోదు, జంకూకొంకూ లేకుండా వాటిని ప్రదర్శించడంలోనే నేటి హీరోయిన్ సక్సెస్ దాగి వుంది. తమ అందాలను ఎంతెలా ఎగ్జిబిట్ చేయగలిగితే అంతలా సక్సెస్ కావచ్చిక్కడ. ఇప్పుడు దీక్షా సేథ్ కూడా ఈ సూత్రంలో నమ్మకాన్ని పెంచుకుంది. 'వేదం' సినిమాలో అలాగే నేటి తరం అమ్మాయికి ప్రతినిధిలా గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా 'మిరపకాయ్' చిత్రంలో అయితే, 'వారేవా' అనే రేంజ్ లో తన అందాల ప్రదర్శన చేసిందట. "ఇందులో 'వేదం'కు మించిన గ్లామర్ గా కనపడతాను. యూత్ కి ఇంకా బాగా నచ్చుతాను" అంటోంది దీక్ష. సినిమా భాషలో 'గ్లామర్' అంటే ఇప్పుడు అందాల ప్రదర్శనే లెండి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతలు దీక్ష వైపు దృష్టి సారిస్తున్నారు. ఒళ్లు దాచుకోకుండా అందాల ఆరబోత చేసే వాళ్లకి సినిమా రంగం ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తుంది కదా? |
Thursday, December 30, 2010
దీక్షా సేథ్ చెబుతున్న గ్లామర్ కబుర్లు
Labels:
DEEKSHA SHADH
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment