![]() | ||
ఆ మధ్య 'ప్రస్థానం' వంటి వైవిధ్యభరిత చిత్రాన్ని రూపొందించి, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న దర్శకుడు దేవా కట్ట తాజాగా తన తదుపరి చిత్రానికి 'ఆటోనగర్ సూర్య' అన్న టైటిల్ ని పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన కధను ఆయన అప్పుడే సిద్ధం చేసుకున్నారు కూడా. విజయవాడ గ్యాంగ్ వార్ ల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తోంది. ఇందులో ప్రముఖ నటుడు బాలకృష్ణ కధానాయకుడుగా నటించనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ చిత్రంలో ఆయన నటించడం లేదట. ఈ విషయాన్ని దేవా స్వయంగా వెల్లడించారు. "బాలయ్య బాబు కాదు ఇందులో హీరో. ఎవరనేది త్వరలో చెబుతాను. అయితే, బాలయ్య బాబుతో చేయడాన్ని ఒక గౌరవంగా భావిస్తాను. ఆ అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తాను" అంటున్నాడు దేవా. సో... ఈ ప్రాజక్టులో హీరో ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది. |
Wednesday, December 29, 2010
'ఆటోనగర్ సూర్య' లో హీరో బాలకృష్ణ కాదా?
Labels:
BALAKRISHNA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment