![]() | ||
అసలు ఒక పెద్ద హిట్ సినిమా పడగానే ఆ సినిమా డైరెక్టర్ యమా బిజీ అయిపోతాడు. బోయపాటి శ్రీను విషయంలో ఇది రివర్స్ అయిందనే చెప్పాలి. 'సింహా' రిలీజ్ అయి, సూపెర్ హిట్ అవగానే, అతనికి చాలా ఆఫర్లు వచ్చాయి. మూడు కోట్లు ఆఫర్ చేసిన వాళ్లు కూడా వున్నారు. అయితే, దేనికీ కమిట్ కాకుండా యన్టీఆర్ తో చేయడానికే అతను కమిట్ అయ్యాడు. అయితే, ఆ ప్రాజక్టు 'అదిగో...ఇదిగో' అంటూ ఊరిస్తోందే కానీ, మొదలవడం లేదు. స్క్రిప్ట్ దగ్గరే ఏదో ప్రాబ్లం వచ్చిందంటున్నారు. దాంతో అది ముందుకి సాగడం లేదు. ప్రస్తుతం యన్టీఆర్ 'శక్తి' సినిమా పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈలోగా మరో వార్త. చిరంజీవి 150 వ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడని. అయితే, అదీ కన్ఫర్మ్ కావడం లేదు. ఏదైనా ఒక పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టరు ఇలా ఎనిమిది నెలల నుంచి ఖాళీగా వుండడం మాత్రం బాగోలేదు. ఒక విధంగా అది అతని స్వయంకృతాపరాధమేనేమో! |
Thursday, December 30, 2010
బోయపాటి శ్రీను సినిమా ఎప్పుడు?
Labels:
BOYAPATI SRINU
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment