![]() | ||
ఇటీవల విడుదలైన 'రగడ' సినిమా మంచి కలక్షన్లు వసూలు చేస్తుండడంతో నాగార్జున ఇప్పుడు మంచి జోష్ లో వున్నారు. ఈ నేపధ్యంలో తన తదుపరి చిత్రం 'రాజన్న' షూటింగ్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే నిజాం కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్స్ వేయడం జరిగిందని నాగ్ చెప్పారు. చిత్ర పరిశ్రమ బంద్ వల్ల షూటింగ్ ఆగిందనీ, లేకపోతే ఈపాటికి ఆ సినిమా షూటింగులోనే ఉండేవాడినని ఆయన అన్నారు. 1940 ల నాటి కధ ఇదనీ, తెలంగాణా వీరునిగా ఇందులో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందనీ చెప్పారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారనీ, రాజమౌళి యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేస్తారనీ నాగ్ చెప్పారు. ఇదిలావుంచితే, ఫిబ్రవరి 12 నుంచి శ్రీనివాస రెడ్డి డైరెక్షన్ లో రూపొందే సోషియో ఫాంటసీ చిత్రం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. |
Thursday, December 30, 2010
నాగ్ 'రాజన్న' కోసం భారీ సెట్స్
Labels:
NAG
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment