
Wednesday, December 14, 2011
మూడు పడవల ప్రయాణం చేస్తున్న తాప్సీ

Tuesday, July 5, 2011
సల్మాన్ పడక గదికి వెళ్లాలనివుంది: సమీరా రెడ్డి

ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను స్లీప్ వాక్ చేస్తూ సల్మాన్‌ఖాన్ బెడ్ రూంలోకి వెళ్ళాలని ఉందని చెప్పుకొచ్చింది. సల్మాన్ అంటే తనకు ఎనలేని ప్రేమ ఉందన్నారు. అయితే, సమీరా ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో పరమార్థం లేకపోలేదు.
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌ది గోల్డెన్ హ్యాండ్‌గా ఉంది. సల్మాన్‌కు వయస్సు మీదపడుతున్నా... అతనితో జత కట్టేందుకు, బెడ్ రూమ్‌లోకి దూరాలనే ఆలోచనతో ఉండే హీరోయిన్ల జాబితా పెరిగిపోతోంది.
అందుకు ఉదాహరణగా అసిన్‌ను చెప్పుకోవచ్చు. చిత్ర పరిశ్రమకు దూరమవుతుందని అనుకుంటున్న తరుణంలో సల్మాన్‌తో జతకట్టి మళ్లీ గాడిన పడింది. అలాగే, "దబాంగ్" హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఇలా సల్మాన్ నమ్ముకుని ఎదగటాన్ని పట్టుగొమ్మగా ఉపయోగించుకుంటోంది.
Saturday, May 21, 2011
పొగడ్తలతో ఇబ్బందుల్లో పడ్డ తార

బాలీవుడ్ కథానాయిక కరీనాకపూర్ కి లౌక్యం తెలియదా? తెలియదనే అంటున్నారిప్పుడు. లేకపోతే అలా ఒకర్ని పొగిడితే మరొకరికి కోపం వస్తుందన్న విషయం తెలియకపోతే ఎలా? అని కూడా అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆమధ్య మలయాళంలో వచ్చిన 'బాడీగార్డ్' సినిమాని ప్రస్తుతం హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా చేసే ముందు అందులో హీరోయిన్ గా నటిస్తున్న కరీనాని నయనతార నటించిన మలయాళం వెర్షన్ తో బాటు, అసిన్ నటించిన తమిళ వెర్షన్ కూడా చూడమని దర్శకుడు సిద్ధిక్ సూచించాడట. చూశాక తన అభిప్రాయం అడిగితే, అసిన్ కన్నా నయనతార బాగా నటించిందని కరీనా కామెంట్ చేసింది. ఇప్పుడిదే పెద్ద కాంట్రావార్సీ అయి కూర్చుంది. కరీనా కామెంట్స్ విన్న అసిన్ ఇప్పుడు కరీనాపై మండిపడుతోంది. "నా నటనకి ఒకరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నేనేమిటో బాలీవుడ్ లో అందరికీ తెలుసు. ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుంది" అంటూ కరీనాకి చురకంటించింది. దీంతో, అనవసరంగా నయనతారని పొగిడి ఇబ్బందుల్లోపడ్డానే.. అని కరీనా ఇప్పుడు ఫీలవుతోందట! | |
మలేసియా వెళ్ళొచ్చిన మెగాస్టార్ మేనల్లుడు

కథ ప్రకారం ఫస్టాఫ్ వెస్ట్ ఇండీస్ లోనూ, సెకండాఫ్ అమెరికాలోనూ జరుగుతుంది. అందుకే ఆయా ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందుతోందని దర్శకుడు చౌదరి చెబుతున్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు. శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు చౌదరి చెప్పారు. తమ 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'ఆ పట్టింపులు' లేవంటున్న ముద్దుగుమ్మ

"అశిన్ లాంటి మంచి నటి, అందగత్తెతో నన్ను పోల్చడం చాలా హ్యాపీగా వుంది. అయితే, నన్ను నన్నుగానే చూడండి. సీమటపాకాయ్ తర్వాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే వాటి వివరాలు చెబుతాను" అంటోంది పూర్ణ. ఒక సినిమా చేసిందో లేదో... అప్పుడే తను తెలుగులో కూడా మాట్లాడేస్తోంది. మరో రెండు మూడు సినిమాలు చేస్తే తన డబ్బింగ్ తానే చెప్పుకుంటానని కూడా చెబుతోంది.
విజయ్ హీరోగా మణిరత్నం కమర్షియల్ సినిమా

నటనకు గుడ్ బై చెప్పనున్న మల్లూ బేబీ

'వీడు తేడా' అంటున్న నిఖిల్

విక్రం, అనుష్కల సినిమా 'నాన్న'

అందాల అనుష్క తాజాగా నటించిన తమిళ చిత్రం 'దైవ తిరుమగన్'. ఇందులో విక్రం కథానాయకుడిగా నటించాడు. దీనిని 'నాన్న' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రం వికలాంగుడి పాత్రలో అద్బుతంగా నటించాడంటున్నారు. ఇందులో అనుష్క లాయర్ పాత్ర పోషించింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విక్రం కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని టాక్. ఈ సినిమా ఆడియోను రేపు (మే 21) హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. శివపుత్రుడు, అపరిచితుడు.... చిత్రాల స్థాయిలో 'నాన్న' సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి! | |
హిందీలో రీమేక్ కానున్న మరో తెలుగు చిత్రం

ఈరోజు యన్టీఆర్ 'స్పెషల్ బర్త్ డే'!

కెరీర్ పరంగా యన్టీఆర్ వయసు కేవలం పదేళ్లు. ఇంతవరకు చేసిన సినిమాలు జస్ట్ పందొమ్మిది. అయితే సంపాదించుకున్న ఇమేజ్ మాత్రం అంతాఇంతా కాదు... వంద సినిమాల ఇమేజ్! ఈ ఇమేజ్, ఫాలోయింగ్ ఈ నందమూరి అందగాడికి అంత ఈజీగా వచ్చేసింది కాదు. ఇంటి పేరు, తాత రూపు ఇనిషియాల్ గా ఓ ఫ్లాట్ ఫారాన్ని ఏర్పరిస్తే... మిగతాదంతా అతని కష్టార్జితం. డ్యాన్సుల్లో గానీ, యాక్షన్ సీన్స్ లో కానీ అతను పడే కష్టం, తపన, తాపత్రయం అతన్నీవేళ ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆ కష్టమే అతనికి శ్రీరామరక్షగా నిలుస్తుంది. ముందు ముందు మరిన్ని విజయాలకు తోడ్కునిపోతుంది.
ఈ జన్మదినం శుభ సందర్భంగా యన్టీఆర్ కు ap7am.com మెనీ హ్యాపీ రిటర్న్స్ చెబుతోంది.
Monday, April 25, 2011
మరో 'బొమ్మరిల్లు' తీస్తున్న దిల్ రాజు?

సంగీత దర్శకురాలిగా కౌసల్య

సమీరా రెడ్డికి ఇంతలోనే ఏమైంది?

అసలు విషయం ఏమిటంటే, ఈమధ్య తన స్నేహితురాలి పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి తనే చూసిందట. దాంతో ఈ పెళ్లి తంతు మీద చిరాకు, విసుగు వచ్చేశాయట. దానికి తోడు, పెళ్లి అనే బంధంతో ఒకరికి భారం అవడం, మరొకరు మనకి బరువవడం తనకిష్టం లేదట. అందుకే పెళ్లికి దూరంగా వుండాలనుకుంటున్నట్టు చెబుతోంది. పెళ్లీడుకొచ్చిన పిల్ల ఇలా మాట్లాడడంతో, సమీరా ఎక్కడో దెబ్బతినే ఉంటుందని బాలీవుడ్ లో కామెంట్లు వినపడుతున్నాయి.
'బద్రీనాథ్' కి మూడు పాటలు బ్యాలెన్స్

తమన్నాకి, చైతన్యకి మధ్య గొడవా?

"అందులో నా పేరు మహాలక్ష్మి. తన పేరు బాలు. ప్రతి చిన్న విషయానికీ ఇద్దరం పోట్లాడుకుంటూ వుంటాం. మరోలా చెప్పాలంటే కార్టూన్ ఫిలిం 'టాం అండ్ జెర్రీ' టైపన్న మాట. మామధ్య ఇలా చిటపటలున్నా.. చూసే వాళ్లకి మాత్రం మంచి ఫన్ గా వుంటుంది" అంటోంది తమన్నా. ఈ సినిమా మే మొదటి వారంలో రిలీజ్ అవుతోంది. చాలా కాలం తర్వాత వస్తున్న తన తెలుగు చిత్రం కాబట్టి, దీని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. దీంతో బాటు 'బద్రీనాథ్', 'ఊసరవెల్లి' చిత్రాలు తనని టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ ని చేసేస్తాయని ఆశిస్తోంది తమన్నా.
రేపటి నుంచి తిరిగి షూటింగులు
గత పద్దెనిమిది రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె ఓ కొలిక్కి వచ్చింది. సమ్మె విరమించి, మంగళవారం నుంచి వీరు షూటింగులలో పాల్గొంటారు. నిర్మాతలకు, ఫిలిం ఫెడరేషన్ కూ మధ్య ఈ రోజు జరిగిన చర్చలు ఫలించి, ఒప్పందం కుదిరింది. కార్మికులకు 32 శాతం మేర వేతనాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించారు. కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై పలుసార్లు నిర్మాతలతో చర్చలు జరిగినా, వేతనాల పెంపుపై ప్రతిష్టంభన ఏర్పడింది. తమ డిమాండ్ మేర వేతనాలు పెంచాల్సిందేనని కార్మికులు పట్టుపట్టడంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. ఇదిలా ఉంచితే, తమను సంప్రదించకుండా నిర్మాతల మండలి ఒప్పందాలు చేసుకుంటోందని చిన్న నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై పలుసార్లు నిర్మాతలతో చర్చలు జరిగినా, వేతనాల పెంపుపై ప్రతిష్టంభన ఏర్పడింది. తమ డిమాండ్ మేర వేతనాలు పెంచాల్సిందేనని కార్మికులు పట్టుపట్టడంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. ఇదిలా ఉంచితే, తమను సంప్రదించకుండా నిర్మాతల మండలి ఒప్పందాలు చేసుకుంటోందని చిన్న నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
రాజమౌళి సినిమాలో నితిన్

Tuesday, April 19, 2011
రామ్ తో తమన్నా ప్రేమకథ

యన్టీఆర్ పెళ్లిలో తెనుగు సంస్కృతి

అంటే, అచ్చం 'పెళ్లి పుస్తకం' సినిమాలోని 'శ్రీరస్తు...శుభమస్తు..శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం' పాటలో బాపుగారు చూపించిన పద్ధతిలో యన్టీఆర్ వివాహ వేడుక ఉంటుందన్న మాట! అందుకే, శుభలేఖతో బాటు స్వీట్లు పంచే పద్ధతిని కూడా ఆయన పెట్టుకోలేదు. సోమవారం నాడు హైదరాబాదులో సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, రామానాయుడు, చిరంజీవి, రాఘవేంద్రరావు, రాజమౌళి, వినాయక్ ల ఇళ్లకు వెళ్లి, పెళ్లి శుభలేఖల్ని స్వయంగా ఇచ్చి ఆహ్
ట్రాఫిక్ కానిస్టేబుల్ గా కమల హాసన్

షకీలా పాట కూడా పాడింది!

జెనీలియా కోరిక తీరడంలేదట!

బాలీవుడ్ కి గురిపెట్టిన ముద్దుగుమ్మ

నేటి వార్తలు....టూకీగా

* వైభవ్, స్నేహ జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తమిళంలో రూపొందిన 'గోవా' సినిమాని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ వారంలో పాటల్ని రిలీజ్ చేస్తారు.
* తెలుగులో వచ్చిన 'వేదం' సినిమా తమిళ రీమేక్ అయిన 'వానం' ఈ నెల 29 న రిలీజ్ అవుతోంది. అనుష్క, శింబు, భరత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అక్కడ కూడా క్రిష్ దర్శకత్వం వహించాడు.
* నయనతార ప్రధాన పాత్రలో తన దర్శకత్వంలో త్వరలో ప్రభుదేవా ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడని కోలీవుడ్ సమాచారం. మరో విశేషమేమిటంటే, ఈ చిత్రాన్ని వీరిద్దరే నిర్మిస్తారట కూడా. సంపాదించుకున్న నాలుగు డబ్బుల్నీ ప్రభుదేవా ఇలా ఖర్చుపెట్టే ప్లాన్ వేస్తున్నాడేమో!
* ఆమధ్య పవన్ కల్యాణ్ నటించిన 'పులి' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రియ మళ్లీ ఇప్పుడు 'కందిరీగ' సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ చేస్తోందట.
స్నేహకు ఇప్పుడు తెలిసొచ్చిందట!

హైదరాబాదుకి 'రానా'? వద్దా?

త్వరలో విడుదల కాబోతున్న తన తొలి హిందీ చిత్రం 'దం మారో దం' ప్రమోషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ విషయంలో ఈ మధ్య రాజస్థాన్, డిల్లీ, ముంబై వంటి పలు ప్రాంతాలు చుట్టివచ్చాడు. అక్కడ ప్రేక్షకుల నుంచి తనకి రెస్పాన్స్ కూడా చాలా బాగుందట. ఇవన్నీ చూస్తుంటే, ముంబై నుంచి హైదరాబాదుకి 'రానా'? వద్దా? అన్నట్టుగా అతని వ్యవహారం ఉందంటున్నారు.
బన్నీ, ఎన్టీఆర్ ల బాటలో ప్రభాస్!

'కాఫీబార్' రిలీజ్ అయ్యేనా?

చంద్రబాబుని కలిసిన యన్టీఆర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఈరోజు యువనటుడు ఎన్టీఆర్ తన తండ్రితో కలిసి వెళ్లి కలిశారు. ఈ మధ్య వీరి మధ్య వారసత్వం విషయంలో మనస్పర్థలొచ్చాయంటూ వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో వీరు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, యన్టీఆర్ కల్సింది మాత్రం వీటి గురించి మాట్లాడడానికి కాదులెండి... మే 5 న జరుగనున్న తన వివాహానికి ఆహ్వానించడానికి మాత్రమే యన్టీఆర్ కలిశాడు. తన పెళ్లి శుభలేఖను ఇచ్చి చంద్రబాబు దంపతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెళ్లి ఏర్పాట్ల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 'అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే' అంటూ యన్టీఆర్ ను సరదాగా కామెంట్ చేశారట కూడా. దానికి యన్టీఆర్ సిగ్గుతో నవ్వుకున్నాడట! | |
ఈసారైనా నిలబెట్టుకుంటాడా ?

అర్థంపర్థం లేని పొగడ్తలు

దర్శకుడు జయంత్ అలిగాడట

అయితే, జయంత్ అలా అలగడానికి అసలు కారణం ఏమిటంటే, ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు బాగా ప్లస్ అయ్యాయనీ, సినిమా సక్సెస్ క్రెడిట్ నంతా ఆయనకే ఇచ్చేస్తున్నారు. దానికి తోడు జయంత్ కన్నా త్రివిక్రమ్ కే ఎక్కువ పారితోషికం ఇచ్చారట. దాంతో జయంత్ ప్రస్తుతం నిర్మాత, పవన్ కల్యాణ్ లపై అలిగి, సినిమా ప్రమోషన్ కి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.
Monday, February 28, 2011
వైభవంగా వైజయంతీ మూవీస్ 'శక్తి' ఆడియో ఫంక్షన్

ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, "మా బ్యానర్ లో నందమూరి వంశానికి చెందిన మూడు తరాల హీరోలతో సినిమాలు నిర్మించే అదృష్టం దక్కింది. రేపు బాలయ్య బాబు తనయుడితో చేయడానికి కూడా మేం రెడీగా వున్నాం. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే, యన్టీఆర్ విశ్వరూపాన్ని ఇందులో చూడచ్చు. అంతటి స్థాయిలో ఆయన నటన వుంటుంది. మెహర్ రమేష్ 500 మంది టెక్నీషియన్లతో ఈ సినిమాను వివిధ లోకేషన్లలో షూట్ చేసారు. మా సంస్థ ప్రతిష్టను పెంచే స్థాయిలో సినిమా వుంటుంది" అన్నారు.
దర్శకుడు మెహర్ రమేష్ చెబుతూ, "నా చిన్నప్పుడు వైజయంతీ మూవీస్ సినిమా వచ్చిందంటే, మా విజయవాడలో అప్సరా థియేటర్ కి వెళ్లి, లైన్ లోనిలబడి టికెట్ తీసుకుని సినిమా చూసేవాడిని. అలాంటి సంస్థలో ఈ భారీ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. బడ్జెట్టు, టైము అనే లిమిటేషన్లు పెట్టుకోకుండా సినిమాని తీయమని నిర్మాత దత్తు గారు మాకు చెప్పారు. ఒక విధంగా ఈ సినిమాకు ఆయనే ప్రాణం. ఆయనకు సినిమా నచ్చితే జనానికి నచ్చినట్టే! ఆయన జడ్జిమెంటు అంతలా వుంటుంది. యంగ్ టైగర్ యన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడిందులో. ఐదు డైమంషన్స్ లో అతను కనపడతాడు. శక్తి పీఠాలకు సంబంధించిన కథ ఇది. యన్టీఆర్ మాత్రమే చేయగల క్యారెక్టర్ ఇది. సినిమాని మన దేశంలోనూ, విదేశాలలోనూ ఎన్నో లోకేషన్లలో షూట్ చేసాం.ఎంతో ప్రయాసతో కుంభమేళాలో కూడా షూటింగ్ చేసాం" అన్నారు.
హీరో యన్టీఆర్ మాట్లాడుతూ, "నేనెప్పుడూ ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ చేయలేదు. ఇదే తొలిసారి. మీరు ఇంత ప్రేమతో ఈ ఫంక్షన్ కి అతిథులుగా వచ్చారు కాబట్టి చేయాలనిపించింది. ఈ రోజు ఈ వేడుకను చూసి తాతగారు ఎంతగానో ఆనందపడతారనుకుంటున్నాను. మెహర్ రమేష్ నా ఆప్తమిత్రుడు. ఓసారి మలేసియాలో 'ఓ కథ చెబుతాను విను' అంటూ ఈ 'శక్తి' కథ చెప్పాడు. అతనీ కథను ఎవరితో చేద్దామనుకున్నాడో కానీ, నేను మాత్రం 'నాతో కాకుండా ఇంకెవరితో చేస్తావ్?' అన్నాను. మాకు దత్తు గారు తోడయ్యారు. ఈ ప్రాజక్టు అలా మొదలైంది. 'ఆది' సినిమా నుంచీ కూడా మణి అన్న నాకు మంచి సాంగ్స్ ఇస్తున్నాడు. ఇందులో కూడా అదరగొట్టాడు. అలాగే కెమెరా మేన్ సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ అద్భుతంగా వుంది. ఎడిటింగ్ లో ఓ పాటలో నన్ను నేను చూసుకుని నమ్మలేకపోయాను. అలాగే, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొత్త లోకాలు క్రియేట్ చేసాడు. అందరూ ఎవరికి వాళ్లు అద్భుతంగా వర్క్ చేసారు" అన్నారు.
చివర్లో, ఈ సినిమాలోని యన్టీఆర్ పాత్ర 'రుద్ర'కు సంబంధించిన వీరరసంతో కూడిన ఫోటో పోస్టర్ ను జాకీ ష్రాఫ్ వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మంజు భార్గవి, కె.యస్.రామారావు, బోయపాటి శ్రీను, హీరోయిన్లు ఇలియానా, మంజరి, మణిశర్మ, సమీర్ రెడ్డి, నిర్మాత కుమార్తెలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ తదితరులు పాల్గొన్నారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ వేడుక ప్రారంభానికి ముందు యన్టీఆర్ అభిమానులు వేలాది మంది నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించారు.
నేటి వార్తలు....టూకీగా

* 'అమ్మ' రాజ శేకర్ దర్శకత్వంలో శ్రీహరి కథానాయకుడుగా నటిస్తున్న 'ముద్ర' సినిమా చివరి షెడ్యులు షూటింగ్ రేపటి (మార్చి 1) నుంచి హైదరాబాదులో జరుగుతుంది.
* కమేడియన్ అలీ హీరోగా వేమగిరి దర్శకత్వంలో రూపొందిన 'తిమ్మరాజు' సినిమా మార్చి 11 న రిలీజ్ అవుతుంది.
* 'వేదం' తమిళ రీమేక్ నుంచి స్నేహా ఉల్లాల్ ని తొలగించి ఆమె స్థానంలో జాస్మిన్ ని తీసుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే శింబు, స్నేహాలపై కొంత షూటింగ్ చేసారు.
* తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ 'మగధీర' ను హిందీలో రణభీర్ కపూర్ తో రీమేక్ చేయడానికి నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు.
* తనపై కుళ్ళు జోకుల సర్క్యులేషన్, వెబ్ సైట్ (I HATE BALAYYA .COM) నిర్వహణపై బాలకృష్ణ సైబర్ క్రైమ్స్ డీసీపీకి కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ ను ఆస్ట్రేలియా నుంచి ఓ తెలుగు వ్యక్తీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు.
మణిరత్నం తో మహేష్ బాబు సినిమా ఖరారు

"ఈ రోజు నా జీవితంలో ఎంతో ఆనందకరమైన దినం. లెజెండరీ మణి సార్ ని కలిసాను. ఆయనతో సినిమా చేయాలన్న నా కల నిజమవుతోంది. మణి సార్ తో సినిమా చేస్తున్నాను" అన్నాడు మహేష్. చారిత్రాత్మక కథాంశంతో మణిరత్నం రూపొందించే భారీ చిత్రంలో మహేష్ నటిస్తున్నాడు. మొదటి నుంచీ ఇందులో ప్రధాన హీరోగా మహేష్ నే తీసుకోవాలని మణి ఆలోచిస్తూ వచ్చాడు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
అనుష్కకి 'బాడీ' సమస్య

"కోలీవుడ్ కి, టాలీవుడ్ కీ ఒకేసారి డేట్లు ఇస్తే ఇక మా పని అయిపోయినట్టే. బాడీ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకని రెండు షూటింగులకీ కాస్త గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తమిళ్ సినిమా షూటింగుకి రెడీ అయ్యే ముందు బాగా తిని ఒళ్లు పెంచాలి. మళ్లీ తెలుగు షూటింగుకి వచ్చే ముందు డైటింగులు, వర్కౌట్లు చేసి సన్నబడాలి. ఇది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. ఇలా వుంటాయి మా బాధలు " అంటోంది. అందుకే, చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట ఈ మంగుళూరు బ్యూటీ!
ఏ.ఆర్.రెహ్మాన్ కి ఆస్కార్ నిరాశ

త్రిష ప్రయత్నాలు ఫలించేనా?

తను నటించిన తొలి హిందీ సినిమా 'కట్టా మీటా' పెద్ద ఫ్లాప్ అవడంతో ఈ చెన్నై భామ ఆమధ్య బాగా అప్ సెట్ అయింది. మళ్లీ అంతలోనే తేరుకుని, ఏది ఏమైనా బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయిందట. అందుకని అక్కడ సినిమా అవకాశాలు పొందడానికి ఇప్పుడిలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. "సౌత్ కీ, హిందీకీ కాస్త తేడా వుంది. అక్కడ సక్సెస్ కావాలంటే బాగా హాట్ గా కనపడాలి. లేకపోతే కష్టం. అందుకే ఈ ప్రయత్నాలు" అంటోంది నవ్వుతూ. మరి, వ్రతం చెడినా త్రిషమ్మకు ఫలితం దక్కుతుందో, లేదో చూద్దాం!
'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' గా శివాజీ

Friday, February 11, 2011
ఒకే రోజు నాలుగు సినిమాల రిలీజ్

నయనతారకి వేలెంటైన్స్ డే సెలెబ్రేషన్ లేదా?

నిఖిల్ హీరోగా 'వీడు తేడా' ప్రారంభం

'గగన'విహారం వర్కౌట్ అవుతుందా?

ఆర్ధిక ఇబ్బందుల్లో రాధిక చెల్లి నిరోషా

తను ఆర్టిస్టుగా మంచి పొజిషన్ లో ఉండగానే ఈ నటి రాంకీ ని మేరేజ్ చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి ఇద్దరికీ అవకాశాలు తగ్గాయి. దాంతో నిరోషా టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. అయితే, ఆమధ్య ఈ దంపతులు చెన్నయ్ లోని జెమినీ సర్కిల్ ప్రాంతంలోని పార్శెన్ కాంప్లెక్స్ లో వున్న రెండు ఫ్లాట్స్ ని తనఖా పెట్టి, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి 50 లక్షలు అప్పుగా తీసుకున్నారట. ఎన్ని నోటీసులిచ్చినా, తిరిగి ఆ మొత్తం చెల్లించకపోవడంతో సదరు బ్యాంకు అధికారులు ఆ ఫ్లాట్స్ ను వేలం వేయడానికి సిద్ధం అవుతున్నారని కోలీవుడ్ సమాచారం.
ఆ హీరోయిన్ కి వరుసగా మరో ఛాన్సిచ్చిన సిద్ధార్థ్!

తన అసోసియేట్ ని పెళ్లాడుతున్న దర్శకుడు

బర్మాలో సందడి చేసిన రామ్ చరణ్

అభిమాన హీరో తమ కళ్ళ ముందు ప్రత్యక్షమవడంతో వాళ్లంతా కేరింతలు కొడుతూ రిసీవ్ చేసుకున్నారు. "బర్మాలో నాలుగు లక్షల మంది తెలుగు వాళ్లు వున్నారంటే నమ్మలేకపోతున్నాను. వారు నాపై చూపించిన ప్రేమపూర్వక ఆదరణకి ముగ్దుడినయ్యాను. ఆ అందమైన ప్రదేశం, రుచికరమైన వాళ్ల వంటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి" అంటున్నాడు చరణ్. ఈ మాటలు విన్న అల్లు శిరీష్ "నాలుగు లక్షల మందా? అంటే, ముంబై, పూనే, అహ్మదాబాద్ లలో వున్న తెలుగు వాళ్ల కంటే ఎక్కువన్న మాట. అయితే, మన నెక్స్ట్ మార్కెట్ బర్మానే!" అంటూ వ్యాపార దృష్టితో కామెంట్ చేసాడు.
నేటి సినిమా వార్తలు... టూకీగా!
ఈ రోజు (ఫిబ్రవరి 11 ) 'గగనం', 'వస్తాడు నా రాజు' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
* వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందే తాజా చిత్రం షూటింగ్ మార్చి 15 న ప్రారంభమవుతుంది.
* ఈ నెల 25 న రిలీజ్ అవ్వాల్సిన 'యమ కంత్రీ' సినిమా వాయిదా పడింది. మార్చి 4 న రిలీజ్ చేస్తారట.
* అల్లరి నరేష్ హీరోగా నటించిన 'అహ నా పెళ్ళంట' సినిమాని ఇటీవల మరణించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితం చేస్తున్నారు.
* రఫీ హీరో, దర్శకుడుగా రూపొందే తెలంగాణా ఉద్యమ చిత్రం 'ఇంకెన్నాళ్ళు' పాటల రికార్డింగ్ జరుగుతోంది.
* 'తెలంగాణా జిందాబాద్' పేరుతో మరో ఉద్యమ చిత్రాన్ని ఎం.యస్. గుప్తా నిర్మిస్తున్నారు.
* ఎల్.బీ.శ్రీరాం, అలీ తాతామనవళ్ళుగా నటించిన 'తిమ్మరాజు' సినిమా ఫిబ్రవరి నెలాఖరున రిలీజ్ అవుతోంది.
* రాంగోపాల్ వర్మ తీస్తున్న ఐదు రోజుల సినిమా 'దొంగల ముఠా' మూడో రోజు షూటింగ్ లో వుంది.
* శ్రీహరి హీరోగా డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేకర్ దర్శకత్వంలో 'ముద్ర' పేరుతో ఓ సినిమా తయారవుతోంది.
* వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందే తాజా చిత్రం షూటింగ్ మార్చి 15 న ప్రారంభమవుతుంది.
* ఈ నెల 25 న రిలీజ్ అవ్వాల్సిన 'యమ కంత్రీ' సినిమా వాయిదా పడింది. మార్చి 4 న రిలీజ్ చేస్తారట.
* అల్లరి నరేష్ హీరోగా నటించిన 'అహ నా పెళ్ళంట' సినిమాని ఇటీవల మరణించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితం చేస్తున్నారు.
* రఫీ హీరో, దర్శకుడుగా రూపొందే తెలంగాణా ఉద్యమ చిత్రం 'ఇంకెన్నాళ్ళు' పాటల రికార్డింగ్ జరుగుతోంది.
* 'తెలంగాణా జిందాబాద్' పేరుతో మరో ఉద్యమ చిత్రాన్ని ఎం.యస్. గుప్తా నిర్మిస్తున్నారు.
* ఎల్.బీ.శ్రీరాం, అలీ తాతామనవళ్ళుగా నటించిన 'తిమ్మరాజు' సినిమా ఫిబ్రవరి నెలాఖరున రిలీజ్ అవుతోంది.
* రాంగోపాల్ వర్మ తీస్తున్న ఐదు రోజుల సినిమా 'దొంగల ముఠా' మూడో రోజు షూటింగ్ లో వుంది.
* శ్రీహరి హీరోగా డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేకర్ దర్శకత్వంలో 'ముద్ర' పేరుతో ఓ సినిమా తయారవుతోంది.
కాజల్ ఇక బాలీవుడ్ చెక్కేస్తుందా?

రేపే నాగార్జున 'ఢమరుకం' ప్రారంభం

Subscribe to:
Posts (Atom)