![]() | ||
త్రిష కి ఇప్పుడు టైం బాగున్నట్టుంది. వరసగా పెద్ద హీరోల సినిమాలు చేసేస్తోంది. ఇటీవలే కమల్ తో 'మన్మధ బాణం' చేసింది. ఇప్పుడు తాజాగా రజనీకాంత్ తో కూడా చేయనుంది. రజనీ తనయ సౌందర్య నిర్మిస్తున్న యానిమేషన్ కమ్ లైవ్ యాక్షన్ సినిమాలో తానిప్పుడు రజనీ సరసన చేయనుంది. ఇందులో రజనీ యానిమేషన్ పాత్రనూ, ఒక లైవ్ క్యారెక్టర్ నూ కూడా చేస్తున్నాడు. లైవ్ క్యారెక్టర్ పక్కన విజయ లక్ష్మి ('చెన్నై 28' ఫేం) నటిస్తుండగా, లైవ్ క్యారెక్టర్ సరసన త్రిషను ఎంపిక చేసారు. మొదట్లో ఈ పాత్రకు విద్యాబాలన్ ని అనుకున్నారు. యానిమేషన్ కు సంబంధించిన షూటింగ్ వర్క్ పూర్తి కాగా, లైవ్ యాక్షన్ కు చెందిన షూటింగ్ చేయాల్సి ఉంది. ఈ బాధ్యతను ప్రముఖ దర్శకుడు కె.యస్.రవికుమార్ స్వీకరించారు. గతంలో ఈ చిత్రానికి 'సుల్తాన్ ద వారియర్' అనే టైటిల్ అనుకున్నారు. తర్వాత 'హర'గా మార్చారు. చివరికిప్పుడు దీని పేరును 'రాణా'గా కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. |
Wednesday, January 12, 2011
లక్కీ చాన్స్ కొట్టేసిన త్రిష
Labels:
TRISHA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment