e-cigarette review Ping Yahoo GOSSIPS: 'భట్టి విక్రమార్క'గా బాలకృష్ణ?

Thursday, February 2, 2012

'భట్టి విక్రమార్క'గా బాలకృష్ణ?

దివంగత నందమూరి తారక రామారావు నటించిన అలనాటి మేటి జానపదం 'భట్టి విక్రమార్క' చిత్రాన్ని బాలకృష్ణ హీరో గా రీమేక్ చెయ్యబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజం చెప్పాలంటే, ఇప్పుడున్న కథానాయకుల్లో బాలకృష్ణ జానపద- పౌరాణిక చిత్రాల్లోని పాత్రల్లో సరిగ్గా ఇమిడిపోతాడన్నది చాలా మంది అభిప్రాయం. గతంలో వచ్చిన 'భైరవ ద్వీపం'... రీసెంట్ గా వచ్చిన 'శ్రీ రామరాజ్యం' కూడా ఇదే విషయాన్ని మరో మారు నిరూపించాయి. 'నర్తనశాల' చిత్రాన్ని రీమేక్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నబాలకృష్ణ , ప్రస్తుతం ఆ సినిమా నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తున్నారట! ఈ నేపథ్యంలోనే ఆయన 'భట్టి విక్రమార్క' చిత్రాన్ని కూడా రీ మేక్ చేయాలని నిర్ణయించుకున్నారనే వార్తలు పరిశ్రమలో వినిపిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం వుందని అంటున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...