
ఇటీవల చిత్ర రంగానికి దూరంగా ఉంటున్న ప్రముఖ నటుడు అరవింద్ స్వామి త్వరలో మళ్లీ వెండితెరపైకి వస్తున్నాడు. సుమారు రెండు దశాబ్దాల క్రితం 'దళపతి' సినిమా ద్వారా తనని వెండితెరకు పరిచయం చేసిన మణిరత్నం రూపొందించే ప్రేమకథా చిత్రంలో అరవింద్ నటిస్తున్నాడు. సమంతా, గౌతమ్ (కార్తీక్ తనయుడు) జంటగా 'పూక్కడై' పేరుతో తమిళంలో రూపొందే ఈ చిత్రంలో హీరోకి గానీ, హీరోయిన్ కి గానీ తండ్రి పాత్రలో అరవింద్ నటిస్తాడట. విశాల్ నటిస్తున్న 'సమరాన్' చిత్రంలో ఇటీవల విలన్ పాత్ర ఆఫర్ చేసినప్పటికీ అరవింద్ తిరస్కరించాడు. అయితే, తన గురువు లాంటి మణిరత్నం అడగడంతో కాదనలేకపోయాడట. విశేషమేమిటంటే, 'బొంబాయి' సినిమాలో అరవింద్ తో జత కట్టిన మనీషా కోయిరాలా ఈ 'పూక్కడై'లో అరవింద్ తో జంటగా నటిస్తుందని తెలుస్తోంది. | |
No comments:
Post a Comment