
తన గత చిత్రాలు చూసినపుడు సరిగ్గాచేయలేదనే ఫీలింగ్ తనకి అస్సలు రాదని చెప్పింది. అలానే పాత్రల ఎంపిక విషయంలో కూడా తనకా ఫీలింగ్ కలగదని అంది. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడటం తనకి అలవాటు లేదనీ... ప్రస్తుతం చేసే వాటిపై శ్రద్ధ పెట్టడమే తనకి ఇష్టమని తేల్చి చెప్పింది. తన నిర్ణయాలు కూడా పర్ ఫెక్ట్ గా వుంటాయి కాబట్టి, గతం గురించి చింతించవలసిన అవసరం తనకి రాలేదని అంది. ఈ మాటలు విన్న వాళ్లు మాత్రం ఆమె ముద్దు ముద్దు మాటల్లో ఇంతటి పరిపక్వత ఉందనుకోలేదు అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇస్తున్నారట! ఇక ప్రస్తుతం తాప్సీ 'దరువు'... 'గుండెల్లో గోదారి' చిత్రాలు చేస్తోంది.
No comments:
Post a Comment