
దీనిని దృష్టిలో పెట్టుకునే, 'ఇకపై రీమేక్స్ చచ్చినా చేయను' అంటూ శంకర్ తాజాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. 'రోబో' సినిమా షూటింగు సమయంలో పూనాలో ఈ సినిమా చూసి, అనుభూతి చెందాననీ, ఆ అనుభూతిని తమిళ ప్రేక్షకులకి కూడా అందించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రీమేక్ చేశాననీ వివరణ ఇచ్చుకున్నాడు. ఈ చిత్ర నిర్మాణం తనకొక కొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెప్పాడు. చిరంజీవి నటించే 150 వ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడంటూ వస్తున్న వార్తలని ఆయన దృష్టికి తీసుకువెళితే, ప్రస్తుతం తాను హాలిడే ఎంజాయ్ చేస్తున్నానని నవ్వుతూ చెప్పాడు శంకర్.
No comments:
Post a Comment