e-cigarette review Ping Yahoo GOSSIPS: నేటి వార్తలు... టూకీగా

Wednesday, February 1, 2012

నేటి వార్తలు... టూకీగా


*  బాలీవుడ్ లో సక్సెస్ అయిన సౌత్ కథానాయిక అసిన్ కి షారుఖ్ ఖాన్ తో నటించాలనే కోరిక అలాగే వుండిపోతోందట. 'అమీర్ ఖాన్, సల్మాన్ లతో నటించాను. షారుఖ్ తో చేస్తే ఖాన్ త్రయంతో చేసినట్టవుతుంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను' అంటోంది అసిన్.
*  రవితేజ, గుణశేఖర్ ల కాంబినేషన్లో రూపొందుతున్న 'నిప్పు' చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈ నెల 3 న హైదరాబాదులో జరుగుతుంది. దీక్షాసేథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్నాడు.
*  కమెడియన్ సునీల్ హీరోగా వీరభద్రం దర్శకత్వంలో రూపొందిన 'పూలరంగడు' చిత్రాన్ని ఈ నెల 18 న రిలీజ్ చేస్తున్నారు. ఇషాచావ్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని 450 దియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
*  పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత, 'గబ్బర్ సింగ్' చిత్ర నిర్మాత బండ్ల గణేష్ తాజాగా నేషనల్ ఎగ్ సెంట్రల్ కమిటీ (NECC) కి మెంబర్ గా ఎంపికయ్యారు. ఐదేళ్ల పాటు ఆయనీ పదవిలో వుంటారు.
*  బాలకృష్ణ కథానాయకుడుగా రవి చావలి దర్శకత్వంలో రూపొందే 'కల్కి' చిత్రం షూటింగు ఈ నెల 6 న హైదరాబాదులో ప్రారంభం అవుతుంది. పార్వతి మెల్టన్ హీరోయిన్ గా నటించే ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ అధినేత పుప్పాల రమేష్ నిర్మిస్తున్నారు.
 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...