
మార్చ్ 20 న ముంబయ్ శివారులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు యూనిట్ వాళ్లు చెబుతున్నారు. కరీనా ఆ సీన్లో అర్జున్ తో కలిసి సిగరెట్ కాలుస్తూ... మందు కొడుతూ... చివర్లో 'బెడ్' షేర్ చేసుకుంటుంది. ఈ సన్నివేశాన్ని వల్గారిటీ లేకుండా... చాలా కళాత్మకంగా చిత్రీకరిస్తాననీ, ఆ సీన్ షూట్ చేసేటప్పుడు రూంలో తనతో బాటు కేవలం ముగ్గురు అసిస్టెంట్స్ మాత్రమే ఉంటారని కరీనాను దర్శకుడు మాధుర్ కన్విన్స్ చేశాడట. పైగా, ఆ సన్నివేశం వివరాలు ఎక్కడా వెల్లడించమని రాతపూర్వకంగా తన అసిస్టెంట్స్ ముగ్గురి నుంచీ 'కాన్ఫిడెన్షియాలిటీ కాంట్రాక్ట్' కూడా తీసుకుంటాడట.
ఈ విషయాన్ని మాధుర్ చెప్పకపోయినా తన యూనిట్ వాళ్ల ద్వారా మీడియాకు లీక్ చేశాడు. అంటే, సినిమాకు హైప్ తెచ్చుకోవడానికి ఇదో రకం పబ్లిసిటీయేమో!
No comments:
Post a Comment