e-cigarette review Ping Yahoo GOSSIPS: అమీర్ ఖాన్ సినిమా కొత్త రికార్డు

Wednesday, February 1, 2012

అమీర్ ఖాన్ సినిమా కొత్త రికార్డు

బాలీవుడ్ ని 'ఖాన్ త్రయం' పాలిస్తున్న కాలమిది. ఎటు తిరిగి ఎటొచ్చీ షారుఖ్, ఆమీర్, సల్మాన్ ఖాన్ల మధ్యే పోటీ నడుస్తుంటుంది. ఇటీవల షారుఖ్ నటించిన 'డాన్ -2' సినిమా ధియేటర్ రైట్స్ 80 కోట్లకి అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రికార్డుని అమీర్ ఖాన్ సినిమా అధిగమించింది. అమీర్ హీరోగా కరీనా కపూర్, రాణి ముఖర్జీ హీరోయిన్లుగా నటించిన 'తలాష్' సినిమా ధియేటర్ హక్కుల్ని రిలయన్స్ సంస్థ 90 కోట్లకు టోకుగా కొనేసింది. అంటే, షారుఖ్ 'డాన్ -2' సినిమా కంటే 10 కోట్లు ఎక్కువన్న మాట. అయితే, ఇదేమీ పెద్ద ఎక్కువ రేటు కాదనీ, 'తలాష్' సినిమాకు ఆ అర్హత వుందనీ బాలీవుడ్ బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. అన్నట్టు, 'తలాష్' జూన్ లో రిలీజ్ కానుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...