e-cigarette review Ping Yahoo GOSSIPS: కాజల్ కి ఇప్పుడు తెలిసొచ్చిందట!

Wednesday, February 8, 2012

కాజల్ కి ఇప్పుడు తెలిసొచ్చిందట!

బాలీవుడ్ లో కూడా మెరిసిపోవాలని ముచ్చటపడిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఆ బులబాటాన్ని వదులుకుంది. హిందీ సినిమాలు చేయడం వల్ల తనకు కొత్తగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని డిసైడ్ అయింది. పైపెచ్చు సమయమంతా వేస్ట్ అయిపోతుందని అనుభవపూర్వకంగా తెలుసుకుంది. అందుకే ఇటీవల ఓ మంచి హిందీ ఆఫర్ని ఈ చిన్నది తిరస్కరించిందట. బాలీవుడ్ లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి కాజల్ కి ఓ ఆఫర్ వచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా మనీష్ శర్మ దర్శకత్వంలో ఆ సంస్థ నిర్మించే సినిమాలో కథానాయికగా కాజల్ ని అడిగారు. అయితే, అదే సమయంలో తమిళ దర్శకుడు మురుగదాస్ నుంచి మరో అవకాశం వచ్చింది. అందులో విజయ్ హీరో. దాంతో కాస్త ఊగిసలాడి, చివరికి హిందీ సినిమా వదులుకుని, తమిళ సినిమానే అంగీకరించిందట. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు బాలీవుడ్ కి వెళ్లి ఏం బావుకుంటామని... కాజల్ తనకు తానే సమాధానం చెప్పుకుంటోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...