e-cigarette review Ping Yahoo GOSSIPS: ఇద్దరు హీరోలతో మధుర శ్రీధర్ చిత్రం

Wednesday, February 8, 2012

ఇద్దరు హీరోలతో మధుర శ్రీధర్ చిత్రం


యువ నటులు వరుణ్ సందేశ్, సాయిరామ్ శంకర్ కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి మధుర శ్రీధర్ దర్శకత్వం వహిస్తారు. గతంలో ఆయన 'స్నేహగీతం', 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి అభిరుచి గల చిత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈ ప్రేమకథా చిత్రంలో 'షాపింగ్ మాల్', 'జర్నీ' చిత్రాల కథానాయిక అంజలి హీరోయిన్ గా నటిస్తుందట. 'ఇట్స్ మై లవ్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించిన మున్నా వెంకటకృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలో దీని షూటింగు ప్రారంభమవుతుంది. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...