e-cigarette review Ping Yahoo GOSSIPS: విజయ్ కి కలసిరావడం లేదు!

Wednesday, February 1, 2012

విజయ్ కి కలసిరావడం లేదు!

తెలుగు ప్రేక్షకుల హృదయం చాలా విశాలమైంది. కథ బాగుంటే సినిమాలనీ... నటన నచ్చితే తారల్ని ప్రాంతాలకీ, భాషలకి అతీతంగా ఆదరిస్తారు-అభిమానిస్తారు. ఓ కమల్ హాసన్ ని, ఓ రజనీ కాంత్ ని పరభాషా కథానాయకులుగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ చూడలేదు. ఈ నాటికీ అఖండ విజయాల్ని అందుకుంటోన్న వారి చిత్రాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. ఇక మలయాళ కథానాయకులైన మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి సినిమాలకి కూడా ఇక్కడి ప్రేక్షకులు విజయాలను కట్టబెట్టారు. ఆ తర్వాత 'సీతాకోకచిలుక'... 'అభినందన'...'ఘర్షణ'...వంటి చిత్రాల ద్వారా కార్తీక్ ని కూడా ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడ్డారు.
     ఈ తరం హీరోలు గా చక్రం తిప్పుతోన్నవిక్రం ...సూర్యా ...అజిత్...కార్తి వంటి కథానాయకుల సినిమాలకి కూడా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఎటొచ్చి తమిళ్ హీరో విజయ్ సినిమాలే ఇక్కడ పాసు మార్కులు సంపాదించుకోవడం కష్టమై పోతోంది. తమిళ్ లో యువతరం అగ్ర కథానాయకుడిగా విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అతను హీరోగా చేసిన 'నన్బన్' చిత్రాన్ని తెలుగులోకి 'స్నేహితుడు' పేరుతో అనువదించాడు శంకర్. అనూహ్యమైన విజయాన్ని అందిస్తుందనుకున్నఈ సినిమా ఆదిలోనే చతికిలపడింది. శంకర్ బ్రాండ్ ఇమేజ్ కూడా ఈ సినిమా విషయంలో పనిచేయక పోవడం విశేషం. గతంలో కూడా విజయ్ నటించిన కొన్ని సినిమాలు రిలీజయ్యాయి. కానీ సక్సెస్ కి దూరంగానే ఉంటున్నాయి. ఎందుకో గానీ, విజయ్ కి తెలుగు నేల అచ్చిరావడం లేదు!      

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...